Gold Price Today: బిత్తిరి చూపులు చూస్తున్న బంగారం ధర.. నగల దుకాణానికి వెళ్తే బిల్లు ఎంత అవుతుందో తెలుసా?

Gold, Silver Prices Today: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. మొత్తానికి.. బంగారం ధరలు తగ్గుతున్నాయనే వార్త కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా, నగలు కొనేటప్పుడు తుది బిల్లును పరిశీలించడం చాలా ముఖ్యం..

Gold Price Today: బిత్తిరి చూపులు చూస్తున్న బంగారం ధర.. నగల దుకాణానికి వెళ్తే బిల్లు ఎంత అవుతుందో తెలుసా?
Gold Price Today

Updated on: Nov 18, 2026 | 6:35 AM

Gold, Silver Prices Today: మహిళలకు ఇష్టమైన బంగారం ధరలు ఇటీవల వరుసగా మారుతూ వస్తున్నాయి. ఒకరోజు పెరుగుతూ.. మరోరోజు తగ్గుతూ కొనుగోలుదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే నవంబర్ 18న బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారు ఆభరణాలు కొనాలని ఎదురుచూస్తున్న వారికి కొంత ఊరట లభించింది. తులం బంగారం ధర రూ.800 వరకు దిగి వచ్చింది.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,030 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,690.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,840.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,030 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,690.
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,030 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,690.
  5. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గుముఖం పడుతోంది. కిలో వెండి ధర రూ.1,89,900 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: RBI లోగోలో పులి, తాటి చెట్టు ఎందుకు ఉన్నాయి? దీని వెనుక ఇంత కథ ఉందా?

ధర తగ్గితే నిజంగానే బంగారం చౌకగా దొరుకుతుందా?

ఇక్కడే కొనుగోలుదారులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వెబ్‌సైట్లలో కనిపించే బంగారం ధరే మనం నగల దుకాణంలో చెల్లించే తుది ధర కాదు.  నగలు కొనుగోలు చేసేటప్పుడు బంగారం ధరతో పాటు తయారీ ఛార్జీలు (Making Charges), వర్తించే GST కూడా కలుస్తాయి. డిజైన్‌ను బట్టి తయారీ ఛార్జీలు మారవచ్చు. అందుకే బంగారం ధర తగ్గిందని వెంటనే తక్కువ బిల్లే వస్తుందని భావించకూడదు.

కొనాలనుకునేవారు ఏం చేయాలి?

బంగారం కొనుగోలు చేసే ముందు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల మధ్య తేడాను తెలుసుకోవాలి. ఆభరణాల కోసం సాధారణంగా 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. పెట్టుబడి కోసం నాణ్యతను బట్టి 24 క్యారెట్ల బంగారాన్ని ఎంచుకుంటారు. అలాగే ఒకే దుకాణంలో కాకుండా రెండు మూడు షాపుల్లో మేకింగ్ ఛార్జీలను పోల్చి చూడటం మంచిది.

ధరలు ఎందుకు మారుతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల డిమాండ్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. మొత్తానికి.. బంగారం ధరలు తగ్గుతున్నాయనే వార్త కొనుగోలుదారులకు ఊరటనిచ్చినా, నగలు కొనేటప్పుడు తుది బిల్లును పరిశీలించడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఒకేసారి 63 ఫైనాన్స్ కంపెనీల లైసెన్సుల రద్దు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us