Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. అయితే, వివాహాలు, శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. తాజాగా, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం (నవంబర్ 07) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.200 మేర పెరిగి.. 75,200 లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,620 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,470 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,350, 24 క్యారెట్ల ధర రూ.61,470గా ఉంది.
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,200 లుగా ఉంది. ముంబైలో రూ.75,200, చెన్నైలో రూ.78,200, బెంగళూరులో రూ.74,000, కేరళలో రూ.78,200 ఉంది. కోల్కతాలో రూ.75,200, హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.78,200, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.78,200 లుగా కొనసాగుతోంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..