Gold Price Today: బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చాలామంది వివాహాది శుభకార్యాలు, పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.

Gold Price Today: బంగారం, వెండిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price Today

Updated on: Nov 27, 2023 | 6:23 AM

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చాలామంది వివాహాది శుభకార్యాలు, పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (నవంబర్ 27) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,290 గా ఉంది. వెండి కిలో ధర రూ. 77,200 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,440 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,550, 24 క్యారెట్ల ధర రూ.62,780, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,290 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,100, 24 క్యారెట్ల ధర రూ.62,290 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.77,200 గా ఉంది. ముంబైలో రూ.77,200 ఉండగా.. చెన్నైలో రూ.80,200, బెంగళూరులో రూ.76,250 ఉంది. కేరళలో రూ.80,200, కోల్‌కతాలో రూ.77,200 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,200, విజయవాడలో రూ.80,200, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us