పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు..! ఇవాళ్టి గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు చూడవచ్చు. ముఖ్యంగా అమెరికా డాలర్ బలహీనపడటం, అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచిన నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.. అయితే బంగారం ధర ఈ ఏడాది గరిష్ట స్థాయి రూ. 1.85తో పోల్చితే రూ. 40 వేలు తక్కువగా పలుకుతుంది. అయితే, ఈ రోజు తక్కువ మొత్తంలో పెరిగిన పసిడి ధరలు దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు..! ఇవాళ్టి గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..
Gold Price Today

Updated on: Jul 31, 2026 | 7:18 AM

భారతదేశంలో బంగారం ఎప్పుడూ ప్రియమైనదే.. పండుగలు, పెళ్లిళ్లు, పుట్టిన రోజులు ఇలా శుభ సందర్భం ఏదైనా సరే.. మన వాళ్లు తప్పనిసరిగా గోల్డ్ కొంటుంటారు. కానీ, గత రెండేళ్ల కాలంలో పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కనీస అవసరాలకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకుండా చేసింది. 2025 సంవత్సరాంతం వరకు గోల్డ్ షాకిస్తూనే వచ్చింది. ఇక, ఈ ఏడాది ఆరంభం నుండి తగ్గుతూ, పెరుగుతూ లక్షన్నరకు అటు ఇటూగా ఊగిసలాడుతూ వస్తోంది.

భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములు రూ.1,44,340లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,32,310లు పలుకుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,44,490, 22 క్యారెట్ల ధర రూ.1,32,460 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100లుగా ఉంది.

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,340, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,32,310 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

పైన సూచించిన ఈ ధరలు ఉదయం 8 గంటల లోపు  మార్కెట్ ప్రారంభానికి ముందుగా నమోదైనవి మాత్రమే.. మార్కెట్ ప్రారంభంతో గోల్డ్ రేట్స్ మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, బంగారం, వెండి నగలు, ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న వారు తప్పని సరిగా అప్పటి ధరలు చెక్ చేసుకోవటం మంచిది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us