
బంగారం.. బంగారమే బ్రదరూ. దానికి మించిన విలువైన ఖనిజాలున్నాయి. అయినా బంగారానికి మించిన క్రేజులేదు. బంగారానికున్నంత డిమాండ్ లేదు. ఎందుకంటే..గోల్డ్….ఎనీ సెంటర్..ఎనీ కంట్రీ..24బై సెవెన్ అమ్మబుల్…కొనబుల్…అన్నింటికి మించి ట్రస్ట్‌ఫుల్. నీ రూపాయి నీదేశంలోనే చెల్లుద్ది. డాలరైనా సరే మరో దేశంలో మార్చుకోవాలంటే కిందా మీదా పడాలి. కానీ బంగారం ఏదేశంలోనైనా సేలబుల్. అందుకే ఇప్పుడు ప్రపంచదేశాలు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థలే కాదు. సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వ్స్‌లు పెంచుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో కేంద్ర బ్యాంకులు రికార్డ్ స్థాయిలో 60 టన్నుల బంగారం కొన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాదిలో ఒక నెలలో ఇంత భారీ స్థాయిలో బంగారం కొనడం ఇదే తొలిసారి. ఇందులో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఏకంగా 27 టన్నులు బంగారం కొనుగోలు చేయడం ప్రత్యేకమని పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో టర్కీ 17 టన్నుల బంగారం కొనుగోలు చేయగా.. పోలెండ్ 8 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. పోలెండ్ లాంటి దేశం కూడా బంగారంపై ఇన్వెస్ట్‌కు ఇంట్రస్ట్ చూపిస్తోంది. ఈమధ్యకాలంలోనే పోలండ్ 100టన్నుల బంగారం కొనుగోలు చేసింది. ఈఏడాదిలోనే సెంట్రల్ బ్యాంకులు 694 టన్నుల బంగారాన్ని కొన్నాయని డబ్ల్యూజీసీ నివేదిక చెబుతోంది. అందులో మన ఆర్బీఐ ఒక్కటే 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత టర్కీ 72 టన్నులు,...