Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. తాజాగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా దిగి వచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

Updated on: Nov 04, 2021 | 6:04 AM

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. తాజాగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. బులియన్‌ మార్కెట్‌లో బంగారం,  వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టి.. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగింది. నిన్న కాస్త పెరిగింది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్‌ 4)న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.  10 గ్రాముల ధరపై రూ.440 నుంచి 600 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా వద్ద కొనసాగుతోంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు..
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
►ఇక తెలుగు రాష్ట్రాల విషయానిస్తే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,600గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price Today: కేంద్రం నిర్ణయంతో భారీగా తగ్గిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. ప్రధాన నగరాల్లో కొత్త రేట్లు!

Onion Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌.. భారీగా తగ్గిన ఉల్లి ధర..!

Loading...
Unable to load recommendations.
Follow Us