Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తాజాగా ఎంత పెరిగిందంటే..!

|

May 15, 2021 | 6:03 AM

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్‌న్యూసే. ఎందుకంటే నిన్న అక్షయ తృతీయ నాడు నిలకడగా ఉన్న పసిడి ధరలు.. తాజాగా శనివారం పెరిగాయి...

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
Gold Price
Follow us on

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్‌న్యూసే. ఎందుకంటే నిన్న అక్షయ తృతీయ నాడు నిలకడగా ఉన్న పసిడి ధరలు.. తాజాగా శనివారం పెరిగాయి. అక్షయ తృతీయ రోజున అందరు బంగారం ధరల్లో పెరుగుదల ఉంటుందని భావించినా.. ధరల మార్పులేమి జరగలేదు. తాజాగా దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ.150 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 వేలరకు చేరుకుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

కాగా, బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి

LIC Customers: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. కరోనా పరిస్థితుల్లో కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం

Akshaya Tritiya 2021: 1925 నుంచి 2021 వరకు పుత్తడి ప్రస్థానం.. అప్పుడు రూ.18 ఉన్న బంగారం.. ఇప్పుడు 49 వేలు