Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు..!

|

Jul 28, 2021 | 6:01 AM

Gold Price Today: భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. పసిడి అంటే భారతీయులకు..

Gold Price Today: బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధరలు..!
Follow us on

Gold Price Today: భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా డిమాండ్‌ ఉంటుంది. ధర ఎంత పెరిగినా కూడా మహిళలు పసిడి కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు దిగి వచ్చాయి. దేశీయంగా బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి ధరలను పరిశీలిస్తే..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 గా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,660 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140 గా ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,190 ఉంది.

► బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,660 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 గా ఉంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చాలా ఉంటుందంటున్నారు.

ఇవీ కూడా చదవండి:

Personal Loan: మీరు బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు.. బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? వీటిని తెలుసుకోండి

Covid Ads: వాణిజ్య ప్రకటనలపై ఫిర్యాదులు.. 332 కోవిడ్‌ యాడ్స్‌లో 12 మాత్రమే సరైనవట: స్పష్టం చేసిన ఏఎస్‌సీఐ