Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన గోల్డ్ రేట్. తులంపై ఎంతంటే..

గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజు బంగారం పెరగడం తప్ప తగ్గడం లేదు. రోజుకు కనీసం రూ. 100 చొప్పున బంగారం ధర పెరుగుతుంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. అయితే మంగళవారం మాత్రం పెరుగుతోన్న బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై....

Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన గోల్డ్ రేట్. తులంపై ఎంతంటే..
Latest Gold Silver Prices

Updated on: Oct 31, 2023 | 6:29 AM

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరకు మంగళవారం కాస్త బ్రేక్‌ పడింది. గడిచిన కొన్ని రోజులుగా ప్రతీ రోజు బంగారం పెరగడం తప్ప తగ్గడం లేదు. రోజుకు కనీసం రూ. 100 చొప్పున బంగారం ధర పెరుగుతుంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. అయితే మంగళవారం మాత్రం పెరుగుతోన్న బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గగా, 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 230 తగ్గింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది. మరి మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 62,550 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,350కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,560గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 57,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.

* ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,400 వద్ద కొనసాగుతోంది.

* ఖమ్మంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400గా ఉంది.

* ఇక విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెరిగింది. మంగళవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలో పెరుగుల కనిపించింది. కిలో వెండిపై ఒకేరోజు ఏకంగా రూ. 1000 పెరగడం గమనార్హం. దీంతో కిలో వెండి ధర రూ. 75,600కి చేరింది. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,500కాగా ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 75,600 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో మంగళవారం కిలో వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us