Gold Price: గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు అదొక సెంటిమెంట్. అయితే గత ఏడాది కాలంగా సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు, మంగళవారం నాడు స్వల్పంగా తగ్గి ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు.

Gold Price: గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold, Silver Prices: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. ఈ రోజు కాస్త ఉపశమనం కలిగించాయి. ప్రతి రోజు పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు మే 8న ఉదయం 10 గంటల సమయానికి తగ్గుముఖం పట్టాయి. అయితే బంగారం ధర తగ్గితే వెండి మాత్రం భారీగా పెరిగింది. కిలోపై ఏకంగా 5000 రూపాయల వరకు ఎగబాకింది.

Updated on: May 05, 2026 | 6:53 AM

బంగారం అంటే భారతీయులకు ఎక్కడలేని సెంటిమెంట్. పండుగైన, శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. అంతేకాదు కష్టాల్లో ఆదుకునే నేస్తంగా బంగారం నిలుస్తుంది. అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే బంగారం సుమారు రూ.లక్ష పెరిగిందంటే దాన్ని డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మంగళవారం పసిడి ధరలు సామాన్యులకు కొంత ఊరటనిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇది మంచి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ధరలు ఇలా

ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.1,49,610 వద్ద కొనసాగుతోంది. ఈ ధర నిన్న రూ.1,49,620గా ఉంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 తగ్గి.. ప్రస్తుతం రూ.1,37,140గా ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,210గా ఉంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,69,900గా ఉంది. నిన్న వెండి ధర రూ.2,70,000గా ఉంది. టు విజయవాడ, వైజాగ్‌లలోనూ ఇవే ధరలు ఉన్నాయి. గడచిన కొన్ని రోజులతో పోలిస్తే ఈ తగ్గుదల చాలా స్వల్పమే అయినప్పటికీ, పెరుగుదల ఆగిపోవడం విశేషం.

ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,760గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,49,770గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,37,290 గా ఉంది. మన పొరుగు రాష్ట్రమైన చెన్నైలో బంగారం ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,52,720గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,990గా ఉంది. అదేవిధంగా కర్నాటకలో హైదరాబాద్ ధరలే ఉన్నాయి. అయితే ఢిల్లీలో మాత్రం కొద్దిగా వెండి ధరలు తక్కువగా ఉన్నాయి. అక్కడ కిలో వెండి రూ.2,64, 900గా ఉంది. అదే చెన్నైలో రూ.2,69,900గా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us