Gold Price Today: పసిడి ప్రయులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందో తెలుసా..?

|

Oct 29, 2023 | 6:25 AM

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే, కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల తగ్గినట్టే కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

Gold Price Today: పసిడి ప్రయులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందో తెలుసా..?
Gold Price today
Follow us on

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అయితే, కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల తగ్గినట్టే కనిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (అక్టోబర్ 29) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,620 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.74,600 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.57,550 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,770 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620, కోల్‌కతాలో 22 క్యారెట్ల రేటు రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,700, 24 క్యారెట్ల ధర రూ.62,950 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,620 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.57,400, 24 క్యారెట్ల ధర రూ.62,620 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,600 ఉండగా.. ముంబైలో రూ.74,600లుగా ఉంది. చెన్నైలో రూ.77,500, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.77,500 ఉంది. కోల్‌కతాలో రూ.74,600, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,500, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.77,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..