Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..

Gold and Silver Latest Prices: వివాహాది శుభకార్యాలు, పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారన్న విషయం తెలిసిందే.. అందుకే పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.

Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
Gold Price Today

Updated on: Nov 28, 2023 | 6:24 AM

Gold and Silver Latest Prices: వివాహాది శుభకార్యాలు, పండుగలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారన్న విషయం తెలిసిందే.. అందుకే పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం (నవంబర్ 28) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.270 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.1,300 మేర పెరిగి .. రూ. 78,500 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,710 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,560 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.78,500 గా ఉంది. ముంబైలో రూ.78,500, చెన్నైలో రూ.81,500, బెంగళూరులో రూ.76,250 ఉంది. కేరళలో రూ.81,500, కోల్‌కతాలో రూ.78,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.81,500, విజయవాడలో రూ.81,500, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us