Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price Today

Updated on: Nov 19, 2023 | 6:24 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం (నవంబర్ 19) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,690 గా ఉంది. వెండి కిలో ధర రూ.500 మేర తగ్గి.. 76,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,790 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,550, 24 క్యారెట్లు రూ.61,690 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,000, 24 క్యారెట్ల ధర రూ.62,180, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది. ముంబైలో రూ.76,000 ఉండగా.. చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.72,250 ఉంది. కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.76,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000, విజయవాడలో రూ.79,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.79,000 లుగా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us