
Gold, Silver Prices: బంగారం, వెండి ధరలలో ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు రెట్టింపుతో దూసుకుపోతున్నాయి. అయితే గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు కాస్త దిగి వస్తున్నాయి. గత రెండు రోజుల్లో తులం బంగారంపై వెయ్యి రూపాయల వరకు దిగి వచ్చింది. అక్టోబర్ 4న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో ధరలను చూద్దాం..
ఇది కూడా చదవండి: WhatsApp వాడే వారికి బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఈ మెసేజ్‌లు ఆగిపోవచ్చు.. ఛార్జీల మోత!
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2026లో ఇప్పటివరకు బంగారం ధర రూ.14,939 మేర పెరిగింది. అదే సమయంలో వెండి ధర రూ.9,591 మేర తగ్గింది. 2025 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర రూ.1.33 లక్షలు ఉండగా, ప్రస్తుతం అది రూ.1.49 లక్షలకు చేరుకుంది.
ఇదిలా ఉండగా, 2025 డిసెంబర్ 31న కిలో వెండి ధర రూ.2.40 లక్షలుగా ఉండగా, ఇప్పుడు అది రూ.2.35 లక్షలకు పడిపోయింది. మరోవైపు జనవరి 29న బంగారం ధర రూ.1.76 లక్షలు, వెండి ధర రూ.3.86 లక్షలతో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో బంగారం ధర భారీగానే తగ్గింది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ను కలిగి ఉన్న ధృవీకరించిన బంగారాన్ని మాత్రమే కొనండి. కొనుగోలు చేసిన రోజున బంగారం ఖచ్చితమైన బరువును, దాని ధరను పలు వనరుల (ఉదాహరణకు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్) ద్వారా సరిచూసుకోండి. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్‌లను బట్టి బంగారం ధరలు మారుతూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: Best Smartphones: రూ.30 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి