Gold and Silver Price: తగ్గేదేలే అంటూ పెరిగిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Oct 13, 2024 | 8:55 AM

దేశ వ్యాప్తంగా దసరా పండగ సంబరాలు ముగిశాయి. దీంతో మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. 

Gold and Silver Price: తగ్గేదేలే అంటూ పెరిగిన పసిడి ధర.. అదే బాటలో వెండి.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us on

దేశ వ్యాప్తంగా దసరా పండగ సంబరాలు ముగిశాయి. దీంతో మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి వైపు దృష్టి సారించారు. ముఖ్యంగా దీపావళి తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుండడంతో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. వాస్తవంగా గత  కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. ఒకరోజులు బంగారం ధర భారీగా తగ్గితే.. మరొక రోజు ఒక్కసారిగా ఆల్ టైం హైకి చేరుకుంటుంది. అయితే ఈ 2014 సంవత్సరం చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. పెట్టుబడుల కోసం అయినా లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఈ రోజు (అక్టోబర్ 13వతేదీ)  గోల్డ్ ధర ఏ నగరంలో ఎలా ఉన్నాయో చూద్దాం.

దసరా పండగ రోజున పెరిగిన బంగారం ధర నేడు కూడా స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకుంది .  భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 10 గ్రాములకు 24 క్యారెట్లకు రూ. 40 పెరిగి రూ. 76,430 కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ. 70,061కు చేరింది.

ఈరోజు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల రూ. 70,052 స్థాయికి చేరింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల రూ. 76,420లుగా కొనసాగుతోంది. ఇదే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, పొద్దుటూరులో కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

  1. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,813లు ఉండగా .. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,160లుగా కొనసాగుతోంది .
  2. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,988.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,350,
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,290, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 69,933
  4. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,520, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 70,143

వెండి ధర :

దీపావళి రానున్న వేళ బంగారం తర్వాత వెండి ధరలు కూడా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 91,840లు ఉంది. అయితే ఢిల్లీ లో మాత్రం తెలుగు రాష్ట్రాల కంటే కొంత మేర వెండి ధర తక్కువగా ఉంటుంది .  దీంతో ఈ రోజు ఢిల్లీలో కిలో వెండి ధర
ఢిల్లీలో రూ. 91,540లు గా కొనసాగుతోంది .

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .