Free Flight Ticket: ఇక మీరు ఫ్రీగా విమానం ఎక్కొచ్చు.. ఉచితంగా టికేట్ తీసుకోవాలంటే ఈ పద్దతి ఫాలో కావాల్సిందే..

మీకు కూడా విమానంలో ప్రయాణించాలని ఉందా.. అది కూడా ఫ్రీగా.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆకాశంలో ఎగిరిపోవాలని ఉందా..? అవును.. ఈ స్టోరీ మీ కోసమే.. ఎందుకంటే మీరు కూడా ఉచితంగా విమానంలో ప్రయాణించాలనుకునేవాకి కోసం పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..

Free Flight Ticket: ఇక మీరు ఫ్రీగా విమానం ఎక్కొచ్చు.. ఉచితంగా టికేట్ తీసుకోవాలంటే ఈ పద్దతి ఫాలో కావాల్సిందే..
Flight

Updated on: May 11, 2023 | 1:58 PM

సమ్మర్ హాలీడేస్ మొదలయ్యాయి. ఫ్యామిలీ మొత్తం ఎటైన టూర్ వేయాలని అనుకుంటారు. చాలా మంది వేసవిలో ప్రయాణించాలని కోరుకుంటారు. ఈ సీజన్‌లో ప్రజలు చల్లటి ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు.  మన దేశం నుంచి విదేశాలకు విమానాలు బుక్ చేసుకుంటారు. అయితే, కొంతకాలంగా విమాన టిక్కెట్ల ధరలు చాలా పెరిగాయి. దీంతో తమ ఫ్లైట్‌కు బదులుగా వేరే ఎంపిక కోసం చూస్తున్నారు. మీరు కూడా ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నప్పటికీ, తగినంత బడ్జెట్ లేకపోవడం.. ఫ్లైట్ టిక్కెట్టు భరించలేకపోవడంతో ప్లాన్‌ను వదులుకుంటారు. ఇలాంటి సమయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉచితంగా ట్రిప్‌ను పెంచుకోవడానికి, మీరు ప్రయోజనాలను ఎలా పొందాలి..  మీరు ఏమి చేయాలి అనేవి ఇక్కడ తెలుసుకుందాం..

మీరు ఎయిర్‌లైన్స్‌తో ప్రయాణించినప్పుడు మీకు రివార్డ్ పాయింట్‌లు ఇవ్వబడతాయి. తరువాత, అది పెద్ద సంఖ్యలో పేరుకుపోయినప్పుడు, టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగించవచ్చు. రివార్డ్ పాయింట్లను రూపాయల్లో మార్చుకుని ఎయిర్ మైల్స్ ఫ్రీగా చుట్టేయవచ్చు. ఉదాహరణకు, స్పైస్‌జెట్ స్కీం కింద ఒక రివార్డ్ పాయింట్‌పై 50 పైసలు ఇస్తుంది.

ఎయిర్ మైళ్లను ఎలా సంపాదించాలి

ఎయిర్ మైల్స్ మూడు విధాలుగా సంపాదించవచ్చు. ఎయిర్‌లైన్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు సైన్ అప్ చేయడం, రివార్డ్ పాయింట్‌లను సంపాదించే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం. ఎయిర్‌లైన్స్ పార్ట్‌నర్ బ్రాండ్‌ల ద్వారా బుకింగ్ చేయడం ద్వారా విమాన బుకింగ్‌లపై ఉచితంగా పొందవచ్చు.

ఎయిర్ మైళ్లను ఎలా రీడీమ్ చేయాలి

ఎయిర్‌లైన్స్ రివార్డ్ పాయింట్‌లను రూపాయిలలో సూచించే విషయంలో, ఈ పాయింట్‌లను టిక్కెట్‌లు, సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పాయింట్లను క్యాష్‌బ్యాక్ ఆఫర్‌గా పరిగణించవచ్చు. ఉదాహరణకు, రూ. 5,000 ధర కలిగిన స్పైస్‌జెట్ టిక్కెట్‌కి.. మీరు 10,000 పాయింట్లు (1 పాయింట్ = 50 పైసలు) పొందుతారు.

ఇలా సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. అది కూడా ఫ్రీ.. ఇంకెందుకు ఆలస్యం బ్యాగ్ సర్ధుకోండి.. రయ్ రయ్ అంటూ గాలిలో ఎగిరిపోండి.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం