Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకునే అవకాశం! డీల్ మిస్ చేసుకోవద్దు.

ఫ్లిప్‌కార్ట్‌ లో ప్రస్తుతం బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ నడుస్తోంది. ఈ సేల్ లో చాలా ప్రొడక్ట్స్ పై ఇంట్రెస్టింగ్ డిస్కౌంట్స్, బ్యాంక్ ఆఫర్లు నడుస్తున్నాయి. అయితే ఈ సేల్ లో షాపింగ్ చేసేవాళ్లు మరో గుడ్ న్యూ్స్ ఏంటంటే ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో భాగంగా కస్టమర్లు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకోవచ్చు. ఈ డీల్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకునే అవకాశం! డీల్ మిస్ చేసుకోవద్దు.
Flipkart Diwali Sale

Updated on: Oct 12, 2025 | 11:52 AM

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ లో ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లతో పాటు చాలా ఇతర గ్యాడ్జెట్స్ పై కూడా మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అయితే వీటితోపాటు ఫ్లిప్ కార్ట్ షాపింగ్ ద్వారా ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కొంతమొత్తం షాపింగ్ చేసిన వారు లక్కీ డ్రా ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ పొందొదచ్చు.

లక్కీ డ్రా కూపన్

ఫ్లిప్‌కార్ట్‌ సేల్ లో భాగంగా రూ.50 వేలకు పైన షాపింగ్ చేస్తే కస్టమర్లు లక్కీ డ్రా కూపన్ పొందుతారు. ఇలా ప్రతి రోజూ ఒకరు లక్కీ డ్రా విన్ అవ్వడం ద్వారా ఏథర్ రీజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌నుపొందే అవకాశం ఉంది. దీని విలువ రూ.1.5 లక్షలు. ఒకవేళ టీవీ, ఫ్రిజ్, ఏసీల వంటివి కొనుగోలు చేస్తే బిల్ ఈజీగా రూ.50 వేలు దాటుతుంది. దీంతోపాటు మీకు అదృష్టం కూడా కలిసి వస్తే లక్కీ డ్రా విన్ అయ్యి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి పట్టుకెళ్లొచ్చు.

స్పెషల్ డిస్కౌంట్స్

ఇకపోతే దీపావళి సందర్భంగా షాపింగ్ చేద్దామనుకున్నవారికి ఇదే మంచి సమయం. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ లో మొబైళ్లు, టీవీలపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్లతోపాటు టాబ్లెట్స్, వేరియబుల్ టెక్నాలజీ గాడ్జెట్స్, సౌండ్ బార్స్, బ్లూటూత్ స్పీకర్స్, పెద్ద హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ను డిస్కౌంట్స్ లో కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్‌లో యూజర్లు  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుపై అదనపు డిస్కౌంట్స్, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ పై స్పెషల్ డిస్కౌంట్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ వంటి వంటి అవకాశాలు కూడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇ‍క్కడ క్లిక్‌ చేయండి