Fixed Deposit Rates: ఈ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు

|

Feb 07, 2023 | 4:38 AM

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి వడ్డీని పొందాలనుకుంటే, మీరు బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. ప్రైవేట్ రంగ..

Fixed Deposit Rates: ఈ బ్యాంకు  ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు
Bank Fd
Follow us on

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి వడ్డీని పొందాలనుకుంటే, మీరు బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 0.50 శాతం పెంచింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీ, సాధారణ ఖాతాదారులకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుందని బంధన్ బ్యాంక్ సోమవారం తెలిపింది. వడ్డీని పెంచిన తర్వాత ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం, ఇతర ఖాతాదారులకు 8 శాతం చొప్పున 600 రోజుల వ్యవధి గల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ లభిస్తుంది. అదే విధంగా 1 సంవత్సరం కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7 శాతానికి పెంచారు. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్లు బంధన్ బ్యాంక్‌లో 0.5 శాతం అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. బ్యాంక్ ఈ కొత్త రేట్లను నేటి నుంచి అమలులోకి తెచ్చింది.

ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది:

రెపో రేటును నిర్ణయించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నిర్వహించింది. గతేడాది 2022లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఫలితంగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు పెంచాయి. ఆ తర్వాత బ్యాంకుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు కూడా పెరిగాయి.

ఈ బ్యాంకులు కూడా వడ్డీని పెంచాయి

అంతకుముందు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లు 18 నెలల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8% వడ్డీని పొందుతున్నారు. అదే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. జన బ్యాంక్ ఇప్పుడు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న ఎఫ్‌డీలపై 8.10 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లు ఈ ఎఫ్‌డిపై 8.80 శాతం వడ్డీని పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి