
కొంతమంది తమ ఆధార్ కార్డు వివరాలను ఫొటోషాప్ లేదా ఇతర ఎడిటింగ్ టూల్స్ ద్వారా మార్చుకుని నకిలీ ఆధార్ కార్డులను ప్రింట్ చేసుకుంటారు. ఈ నకిలీ కార్డు ద్వారా పలు ప్రయోజనాలు పొందుతుంటారు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు యూఐడీఏఐ అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. అదే క్యూఆర్ కోడ్ స్కానర్ విధానం. ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అది నకిలీ ఆధార్నా లేదా నిజమైన ఆధార్నా అనేది సులభంగా గుర్తించవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా వచ్చే వివరాలు యూఐడీఏఐ ద్వారా డిజిటల్ సంతకం చేసి ఉంటాయి. వీటిని ట్యాపరింగ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. దీంతో నకిలీ కార్డులను గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ పద్దతిని యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఇందుకోసం ఆధార్ యాప్, యూఐడీఏఐ పోర్టల్‌లో క్యూఆర్ కోడ్ ప్రమాణికత సదుపాయం కల్పించింది. ఇదెలా అనేది చూద్దాం.
-గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ లేదా ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి
-ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి స్కానర్ ఆప్షన్ ఎంచుకోండి
-ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
-అనంతరం కార్డుదారుడి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఫొటో, లింగం లాంటి వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి
-ఈ వివరాలు, కార్డుపై ఉండే వివరాలు సరిపోలకపోతే అది నకిలీ ఆధార్ కార్డు అని అర్థం చేసుకోవచ్చు
–యూఐడీఏఐ వెబ్ సైట్ తెరవండి
-వెరిఫై ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-అనంతరం కార్డుపై ఉండే 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేయండి
-క్యాప్చాను ఎంటర్ చేసి వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి
-అనంతరం వ్యక్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, లింగం లాంటి వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి
-ఒకవేళ డేటాబేస్‌లో వివరాలు రాకపోయినా, వేరే వివరాలు వచ్చినా అది ఫేక్ కార్డు అని అర్థం చేసుకోవచ్చు.
అసలైన ఆధార్ కార్డులపై రంగుల వలయాలు, లైన్ల స్పష్టంగా ఉంటాయి. అదే నకిలీ కార్డులను ఇంక్జెట్ ప్రింటర్ల ద్వారా సృష్టిస్తారు. దీని వల్ల ఆ కార్డులపై లైన్లు, వలయాలు మసకగా ఉంటాయి. ఇక నకిలీ కార్డులపై యూఐడీఏఐ లోగో బ్లర్‌గా ఉంటుంది. వీటిని క్షుణ్నంగా పరిశీలించడం ద్వారా నకిలీ కార్డులను పసిగట్టవచ్చు.