IT Refund: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా రీ ఫండ్ జమ కాలేదా..? ఎన్ని రోజులకు జమ అవుతుందంటే..?

|

Jul 20, 2024 | 4:30 PM

భారతదేశంలో నిర్ణీత ఆదాయ పరిమితి దాటితే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు జరిగితే కచ్చితంగా రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలి. అయితే రీఫండ్ క్లెయిమ్ చేయాలంటే ముందుగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్‌లోనే మనకు ఆదాయపు పన్ను తీసేయగా ఇంకా ఎంత వస్తుందో? పేర్కొంటే రీఫండ్ ఆటోమెటిక్‌గా మన బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉంటుంది.

IT Refund: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా రీ ఫండ్ జమ కాలేదా..? ఎన్ని రోజులకు జమ అవుతుందంటే..?
Income Tax
Follow us on

భారతదేశంలో నిర్ణీత ఆదాయ పరిమితి దాటితే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తే రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు జరిగితే కచ్చితంగా రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలి. అయితే రీఫండ్ క్లెయిమ్ చేయాలంటే ముందుగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్‌లోనే మనకు ఆదాయపు పన్ను తీసేయగా ఇంకా ఎంత వస్తుందో? పేర్కొంటే రీఫండ్ ఆటోమెటిక్‌గా మన బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఐటీ రిటర్న్స్ దాఖలు నెలలు గడుస్తున్నా కొంత మందికి రీఫండ్ జమ కావడం లేదు. కానీ సాధారణంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఎన్ని రోజులకు రీఫండ్ జమ అవుతుంది? ఏయే కారణాల వల్ల రీఫండ్ జమ కాలేదు? వంటి వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసిన వారు వాపసు ప్రక్రియపై సమగ్ర అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల పన్ను బాధ్యతను అంచనా వేసినప్పుడు వారు తుది పన్ను గణనకు వచ్చే ముందు వర్తించే అన్ని తగ్గింపులు, మినహాయింపులను నిశితంగా పరిశీలిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ ద్వారా ముందుగా ధ్రువీకరించబడిన బ్యాంక్ ఖాతాలకు మాత్రమే రీఫండ్‌లు జారీ చేస్తారు. కాబట్టి బ్యాంక్ ఖాతాలోని పేరు పాన్‌లోని పేరుతో ధ్రువీకరించుకుంటారు. పన్ను చెల్లింపుదారు రిటర్న్‌ను ఈ-ధృవీకరించే వరకు పన్ను శాఖ వాపసుల ప్రక్రియను ప్రారంభించదు. పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం పన్ను చెల్లింపుదారుల ఖాతా రిటర్న్‌తో జమ కావడానికి సాధారణంగా నాలుగు నుండి ఐదు వారాలు పడుతుంది. కాబట్టి నాలుగు నుంచి ఐదు వారాల్లోపు మీ రీఫండ్ జమ కాకపోతే ఏం చేయాలో? చూద్దాం.

ఐటీఆర్ రీఫండ్ ఆలస్యమైతే..?

గడువులోపు పన్ను చెల్లింపుదారు వాపసు పొందకపోతే మీ ఐటీఆర్ దాఖలులో ఏమైన పొరపాట్లు జరిగాయో? తనిఖీ చేయాలి. మీ రిటర్న్స్‌కు సంబంధించి ఐటీ విభాగం నుంచి ఏదైనా కరస్పాండెన్స్ కోసం వారి ఈ-మెయిల్‌ను తనిఖీ చేయాలి. లేకపోతే ఐటీఆర్ వెబ్‌సైట్ రీఫండ్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి
  • ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లాలి.
  • వినియోగదారుడి ఐడీ, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
  • ఈ-ఫైల్ ట్యాబ్‌కు వెళ్లి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ విభాగానికి వెళ్లి ఫైల్ చేసిన రిటర్న్స్ చూడాలి.
  • ఇప్పుడు మీరు కోరుకున్న అసెస్‌మెంట్ సంవత్సరానికి వాపసు స్థితిని తనిఖీ చేయవచ్చు . అక్కడ ఇక్కడ మీరు దాఖలు చేసిన ఐటీఆర్ లైఫ్ సైకిల్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.

బ్యాంకు ఖాతా సమస్యలు

  • బ్యాంక్ ఖాతా ముందుగా ధ్రువీకరించకపోతే మీ ఐటీఆర్ రీఫండ్ జమ కాదు
  • అలాగే బ్యాంక్ ఖాతాలో పేర్కొన్న పేరు పాన్ కార్డ్ వివరాలతో సరిపోలకపోయినా, ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పుగా ఉన్నా రీఫండ్‌లో సమస్యలు ఎదురుకావచ్చు. 
  • మీకు ఐటీఆర్ రీఫండ్ కావాలంటే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను తప్పనిసరిగా ఈ-ధృవీకరించాల్సి ఉంటుంది. మీ ఐటీఆర్‌ను ఇ-వెరిఫై చేయడానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసిన రోజు నుండి ముప్పై రోజుల సమయం ఉంటుంది. ఈ లోపు మీరు ఐటీఆర్ ఈ-ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి