
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందింది. పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. అక్టోబర్ నెలకు సంబంధిన పీఎఫ్ డబ్బులను నవంబర్ 15వ తేదీలోగా జమ చేయాలని కంపెనీలను ఈపీఎఫ్ఓ ఆదేశించింది. దీంతో దాదాపు కంపెనీలన్నీ ఉద్యోగికి గత నెలకు సంబంధించి పీఎఫ్ చందాలను ఇప్పటికే చెల్లించాయి. ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వీటిని యాజమాన్యాలు జమ చేయగా.. ఇవి పడ్డాయా.. లేదా అనేది ఖాతాదారులు చెక్ చేసుకోవచ్చు. అయితే నవంబర్ 1వ తేదీ నుంచి ఈపీఎఫ్ఓ వాట్సప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వాట్సప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ సలువుగా చెక్ చేసుకోవచ్చు. గత నెల పీఎఫ్ చందా క్రెడిట్ అయిందా.. లేదా అనేది ఈజీగా తెలుసుకునే వెసులుబాటు ఉంది.
అక్టోబర్ నెల వేతనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ దాఖలు చేసి నవంబర్ 15వ తేదీలోగా ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్లను జమ చేయాలని ఈపీఎఫ్ఓ ఆదేశించింది. నవంబర్ 15వ తేదీన ఆదివారం రావడంతో కంపెనీలన్నీ ముందుగా చెల్లించాయి. దీంతో ఇవి ఇప్పటిక ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో పడ్డాయి. గడువులోగా పీఎఫ్ సొమ్మును జమ చేయడం ద్వారా ఉద్యోగుల ఖాతాలకు సకాలంలో అందటంతో పాటు వారి ఆర్ధిక అవసరాల కోసం ఉపయోంచుకోవచ్చు. దీంతో పాటు ఆలస్య రుసుంలను కూడా నివారించవచ్చు. యాజమాన్యాలు పీఎఫ్ పోర్టల్ ద్వారా చెల్లించేముందు ఉద్యోగి వివరాలు, సమాచారం, వేతన, వాటా లెక్కలు వంటివి సరిగ్గా చూసుకోలని సూచించింది. ఈ గడువులోగా చెల్లించకపోతే వడ్డీ, నష్టపరిహారం వంటివి చెల్లించాల్సి రావొచ్చు. యాజమాన్యాలు తమ చట్టబద్దమైన బాధ్యతలను నెరవేర్చాలని తెలిపింది. ఉద్యోగి వేతనం నుంచి ప్రతీ నెలా 12 శాతం కట్ చేసి యాజమాన్యం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ అందుకు సమానంగా మరో 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. యాజమాన్యం చెల్లించే సొమ్ములో కొంతమొత్తం పెన్షన్ ఫండ్కకు వెళుతుంది.
-8796441800 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ చేయాలి. ఈపీఎఫ్ఓ రికార్డ్ అయిన నెంబర్ ద్వారా మాత్రమే మెస్సేజ్ పంపాలి
-అనంతరం ఆప్షన్లలో పీఎఫ్ బ్యాలెన్స్ లేదా గత ఐదు లావాదేవీలు ఎంచుకోవాలి
-మీ కంపెనీ పేరు ఎంచుకోవాలి
-మీ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి
-ఆ తర్వాత మీ బ్యాలెన్స్, గత ఐదు లావాదేవీలు వివరాలు కనిపిస్తాయి
-అందులో సెప్టెంబర్ నెలకు కాంట్రిబ్యూషన్ జమ అయితే ఎంత వచ్చిందనేది కనిపిస్తుంది