Chicken, Eggs: పడిపోతున్న గుడ్లు, చికెన్ ధరలు.. ఎందుకంటే..

| Edited By: Ravi Kiran

Jan 06, 2022 | 6:59 AM

సాధారణంగా డిసెంబరు, జనవరిలో గుడ్లు, చికెన్‎కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి.

Chicken, Eggs: పడిపోతున్న గుడ్లు, చికెన్ ధరలు.. ఎందుకంటే..
Eggs
Follow us on

సాధారణంగా డిసెంబరు, జనవరిలో గుడ్లు, చికెన్‎కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయి. కానీ జనవరి 3 తర్వాత దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. దీంతో గుడ్లు, చికెన్ సరఫరాపై ప్రభావం పడింది. ఢిల్లీలోని ఘాజీపూర్ ముర్గా మండిలో చికెన్ ధరలు 25 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో గుడ్ల ధరలపైనా ప్రభావం పడింది.

దుకాణాల్లో రూ.200 వరకు విక్రయించే 30 గుడ్ల ధర రూ.150కి తగ్గింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనూ గుడ్ల ధరలు పడిపోయాయి. ఉడకబెట్టిన గుడ్లు ఇప్పుడు చిల్లరగా రూ.7కు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు 8-10 రూపాయలకు విక్రయించేవారు. ప్రస్తుతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గుడ్లు అత్యంత చౌకగా లభిస్తున్నాయి. ఇక్కడ 100 కోడిగుడ్లు ధర రూ.450 దిగువకు పడిపోయింది.

ఢిల్లీలోని అతిపెద్ద చికెన్ మార్కెట్ అయిన ఘాజీపూర్ వ్యాపారులు టీవీ9 డిజిటల్‌తో మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల ఆర్డర్లు తగ్గాయని చెప్పారు. 10 రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర 200కి ఉందని ఘాజీపూర్ ముర్గామండిలో దుకాణం నడుపుతున్న మహ్మద్ అనాస్ అన్నారు. అదే సమయంలో జనవరి 3 తర్వాత కిలో రూ.150కి తగ్గిందని పేర్కొన్నారు.

Read Also..  Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్‌..!