
Investment Plan: చాలామంది 60 ఏళ్ల వరకు ఉద్యోగం చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ, ‘స్మార్ట్ ఇన్వెస్టర్లు’ మాత్రం 45 ఏళ్లకే రిటైర్మెంట్ పొంది జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇది సాధ్యమేనా? అంటే ఖచ్చితంగా సాధ్యమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న ‘స్టెప్-అప్’ ట్రిక్ ఉపయోగించడం.
సాధారణ ఇన్వెస్టర్లు ప్రతి నెలా ఒకే మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో సిప్ (SIP) చేస్తారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు తమ జీతం పెరిగిన ప్రతిసారీ, తమ SIP మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్తారు (దీనినే Annual Step-up అంటారు). ఈ ఒక్క అలవాటు మీ రిటైర్మెంట్ నిధిని రెట్టింపు చేస్తుంది.
ఇది కూడా చదవండి: RBI: రద్దు చేసిన రూ.2,000 నోట్లు ఏమయ్యాయి? ఆర్‌బీఐ వాటిని ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఒక 25 ఏళ్ల యువకుడు తన 45 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, ఈ కింది వ్యూహాన్ని అనుసరించాలి:
నెలకు ప్రారంభ పెట్టుబడి (Monthly SIP): రూ.9,000
వార్షిక స్టెప్-అప్ (Annual Step-up): 15% (అంటే ప్రతి సంవత్సరం మీ SIP మొత్తాన్ని 15% పెంచాలి)
పెట్టుబడి కాలం: 20 ఏళ్లు
అంచనా వేసిన వార్షిక రాబడి: 15%
20 ఏళ్ల తర్వాత లభించే మొత్తం: సుమారు రూ.3,64,92,972 (రూ.3.65 కోట్లు).
సాధారణంగా అందరూ 10% స్టెప్-అప్ తీసుకుంటారు. కానీ 45 ఏళ్లకే రిటైర్మెంట్ కావాలనుకునే వారు 15% పెంచుకుంటూ వెళ్లడం ఉత్తమమని నిపుణుల సలహా.
మీరు 45 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత మీ వద్ద ఉన్న రూ.3.65 కోట్ల నిధిని సిస్టమాటిక్ విత్ డ్రా ప్లాన్ (SWP) లో పెట్టుబడి పెట్టాలి. ఈ నిధిపై 7% వార్షిక రాబడి వస్తుందని అంచనా వేస్తే, మీరు ప్రతి నెలా రూ.2,00,000 పెన్షన్ పొందవచ్చు. కేవలం పెన్షన్ మాత్రమే కాదు, ఇలా 40 ఏళ్ల పాటు నెలకు రూ.2 లక్షలు డ్రా చేసుకున్న తర్వాత కూడా మీ దగ్గర అత్యవసరాల కోసం దాదాపు రూ.6.73 కోట్ల భారీ ఫండ్ మిగిలే అవకాశం ఉంది.
త్వరగా పెట్టుబడి ప్రారంభించడం, ప్రతి ఏటా పెట్టుబడిని పెంచుకుంటూ పోవడం వల్ల కాంపౌండింగ్ శక్తి అద్భుతాలు చేస్తుంది. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి ఉంటే 45 ఏళ్లకే ఫైనాన్సియల్ ఫ్రీడమ్ పొందడం కష్టమేమీ కాదు.
ఇది కూడా చదవండి: Car AC: కారు ఏసీతో ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? గంటకు ఎన్ని లీటర్లో తెలిస్తే షాక్ అవుతారు!
ఇది కూడా చదవండి: D-Mart Secrets: డి-మార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. రూ.5000 బిల్లును రూ.2000కు తగ్గించుకునే సూపర్ ట్రిక్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి