OLA Electric: ఓలాను ఆటాడుకుంటున్న కస్టమర్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..

|

Oct 11, 2024 | 7:54 AM

ఓలా స్కూటర్ల సమస్యలు, సర్వీసింగ్ సెంటర్ల ముందు బారులు తీరిన వాహనాల ఫొటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్కూటర్ల వల్ల ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులను ఇవి తెలియజేస్తున్నాయి. ఓ సర్వీసింగ్ ముందు రిపేర్ కోసం వచ్చి, దుమ్ముతో అధ్వానంగా ఉన్న ఓలా స్కూటర్ల ఫొటోను హాస్యనటుడు కునాల్ కమ్రా పోస్టు చేశారు.

OLA Electric: ఓలాను ఆటాడుకుంటున్న కస్టమర్లు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
Ola Electric
Follow us on

ఎలక్ట్రిక్ స్కూటర్లకు లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన అనేక రకాల మోడళ్లు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఆధునాతన ఫీచర్లు, స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. మంచి రేంజ్, నాణ్యమైన పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. ఎలక్ట్రిక్ మార్కెట్ లో ఓలా కంపెనీ షేర్ కూడా ఎక్కువే. అయితే ఓలా స్కూటర్లు తరచూ మరమ్మతులు గురవుతున్నాయని, ఇబ్బందులను కలిగిస్తున్నాయని వాటిని కొనుగోలు చేసిన కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా అనే క పోస్టులు వస్తున్నాయి. ఇటీవల ఓ వ్యక్తి విడుదల చేసిన వీడియా వైరల్ మారింది.

వీడియో వైరల్..

వీడియో లో కనిపించిన వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. అతడు ఓలా సర్వీసింగ్ సెంటర్ లో ఉన్నాడు. తన ఓలా స్కూటర్ ను రెండు నెలల క్రితం సర్వీస్ చేయడానికి ఇచ్చాడు. అతడి స్కూటర్ తో పాటు చాలా స్కూటర్లు ఆ సర్వీస్ సెంటర్ లో ఉన్నాయి. రిపేరు కోసం వచ్చిన వాటినన్నంటినీ చాలా ఇరుకుగా పార్కింగ్ చేశారు. ఓలా స్కూటర్ల వల్ల కస్టమర్లు పడుతున్న ఇబ్బందులకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. సర్వీసింగ్ కు ఇచ్చిన స్కూటర్లు నెలల తరబడి అక్కడే ఉండిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.

అనేక ఇబ్బందులు..

అక్కడే ఉన్న మరో ఓలా కస్టమర్ కూడా వీడియోలో తన ఆవేదనను వెల్లడించాడు. స్కూటర్ ను కొనుగోలు చేసి తాను చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయాడు. తన బండికి కొన్నిసార్లు షాకర్ పనిచేయడం లేదని, మొత్తం రీసెట్ అవుతుందన్నారు. ఒక్కోసారి అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల రెండు సార్లు ప్రమాదం బారిన పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు మరోసారి పునరాలోచించుకోవాలని హితవు పలికాడు. కొత్త స్కూటర్ కోసం దాదాపు రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చాడు.

పోస్టుల యుద్దం..

ఓలా స్కూటర్ల సమస్యలు, సర్వీసింగ్ సెంటర్ల ముందు బారులు తీరిన వాహనాల ఫొటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్కూటర్ల వల్ల ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులను ఇవి తెలియజేస్తున్నాయి. ఓ సర్వీసింగ్ ముందు రిపేర్ కోసం వచ్చి, దుమ్ముతో అధ్వానంగా ఉన్న ఓలా స్కూటర్ల ఫొటోను హాస్యనటుడు కునాల్ కమ్రా పోస్టు చేశాడు. దానిపై ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ స్పందించాడు. డబ్బులు తీసుకుని కమ్రా ఆ పోస్టు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై వీరిద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది.

ఓలా స్టాక్ ధర పతనం..

ఏదిఏమైనా ఓలా స్కూటర్ల పనితీరు సక్రమంగా లేక ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన వాహనం పనిచేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఓలా స్టాక్ లపై కూడా ప్రభావం చూపింది. వాటి ధర కూడా తగ్గటానికి కారణమైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..