
చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. ఆగస్టు 1 శుక్రవారం నుండి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, కొన్ని వాహనాల్లోనూ విరివిగా ఉపయోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇప్పుడు, రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ.1631.50 కు లభిస్తుంది. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. ఇక ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. చిన్న వ్యాపారాలకు వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు కొంతమేర ఉపశమనం కలిగించనుంది.
ఇప్పుడు 19 కిలోల సిలిండర్ ధర కోల్కతాలో రూ. 1631.50, ముంబైలో రూ. 1582.50 మరియు చెన్నైలో రూ. 1789. ఈ ఆర్థిక సంవత్సరంలో దీని ధర నిరంతరం తగ్గుతూనే ఉంది. మార్చిలో, ఢిల్లీలో దీని ధర రూ. 1803. ఏప్రిల్లో రూ. 1762, మేలో రూ. 1747.50, జూన్లో రూ. 1723.50 మరియు జూలైలో రూ. 1665.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి