
China Gold Reserves: బంగారంపై చైనాకున్న మోజు తగ్గే సూచనలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 2026 నాటికి ఆ దేశ బంగారు నిల్వలు 2,410 టన్నులకు పెరిగాయి. చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా సెప్టెంబర్‌లో 23 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అక్టోబర్ 2023 తర్వాత ఒకే నెలలో జరిగిన అతిపెద్ద కొనుగోలు ఇదే. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, చైనా వరుసగా 23 నెలలుగా తన బంగారు నిల్వలను పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు, ఆ దేశం మొత్తం 103 టన్నుల బంగారాన్ని తన నిల్వలకు చేర్చింది. ఒక ప్రశ్న తలెత్తుతోంది.. చైనా ఇంత బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తోంది?
WGC డేటా ప్రకారం.. PBoC జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 63 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023 మూడవ త్రైమాసికం తర్వాత ఇదే అతిపెద్ద త్రైమాసిక కొనుగోలు. చైనా మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 8.5 శాతం. ముఖ్యంగా, విదేశీ కరెన్సీలో ఉన్న ఆస్తుల విలువ తగ్గడం వల్ల, సెప్టెంబర్‌లో చైనా మొత్తం విదేశీ మారక నిల్వలు 2 శాతం తగ్గి సుమారు $3.8 ట్రిలియన్లకు పడిపోయాయి.
ఇది కూడా చదవండి: Gold Loan: మీరు మీ బంగారు రుణ వాయిదాలు చెల్లించకపోతే వేలం వేస్తారా? నిబంధనలు ఏంటి?
సెప్టెంబర్‌లో బంగారం ధరలు తగ్గిన సమయంలో చైనా కొనుగోళ్లు జరిగాయి. డాలర్లలో LBMA బంగారం ధర 8.5 శాతం, యువాన్లలో షాంఘై బెంచ్‌మార్క్ ధర 5.5 శాతం తగ్గాయి. WGC విశ్లేషణ ప్రకారం, యూఎస్ ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠినతరం అవుతున్న విధానం, బలపడుతున్న డాలర్ కారణంగా ఇది జరిగింది. అయినప్పటికీ, త్రైమాసికం అంతటా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్ ప్రారంభంలో ధరలు స్థిరంగా ఉన్నాయి. తర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు $4,100 కంటే ఎక్కువగా ఉంది.
విశ్లేషకుల ప్రకారం.. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుని, తన విదేశీ మారక నిల్వలను మరింత సురక్షితం చేసుకోవడమే చైనా లక్ష్యం. మనీ మెటల్స్ ఎక్స్ఛేంజ్ విశ్లేషకుడైన మైక్ మహ్రే, బంగారం అనేది మరో దేశ ప్రభుత్వానికి భారంగా మారని ఒక ఆస్తి అని అంటారు. డాలర్లలో విలువ కట్టే ఆస్తుల విలువ ఆ దేశ పనితీరు, దాని ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి నష్టభయాలు ఉండవు.
ఈ వ్యూహం వెనుక రెండు ప్రధాన ఆందోళనలు కారణంగా పేర్కొంటున్నారు. మొదటిది అమెరికా నిరంతరం పెరుగుతున్న అప్పు. అమెరికా తన ఖర్చులో గణనీయమైన భాగాన్ని అప్పుల ద్వారా సమకూరుస్తుంది. అలాగే ప్రపంచ కరెన్సీగా డాలర్ పోషిస్తున్న పాత్ర దాని బడ్జెట్ లోటును పూడ్చడానికి సహాయపడుతుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు డాలర్లు, అమెరికా బాండ్లను కలిగి ఉండటంపై ఆసక్తి కోల్పోతే, అమెరికాకు అప్పులు చేయడం మరింత ఖరీదైనదిగా మారవచ్చు. ఇది డాలర్‌పై ఒత్తిడిని పెంచుతుంది.
చైనా వ్యూహం కేవలం సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాదు. భౌతిక బంగారం వ్యాపారం, చెల్లింపుల పరిష్కారాల కోసం హాంకాంగ్‌ను ఒక ప్రధాన ప్రపంచ కేంద్రంగా మార్చడానికి కూడా అది ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బంగారం నిల్వ సామర్థ్యాన్ని విస్తరించడం, అలాగే యువాన్ కోసం ఫ్యూచర్స్, ట్రేడింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి. బంగారం ధరను నిర్ణయించే కరెన్సీకి, దాని చెల్లింపునకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంతర్జాతీయ బంగారు వాణిజ్యంలో గణనీయమైన భాగం డాలర్లకు బదులుగా యువాన్లలో జరగడం ప్రారంభిస్తే, ప్రపంచ వాణిజ్యంలో చైనా కరెన్సీ మరింత ముఖ్యమైన పాత్ర పోషించగలదు. ఇది దేశాలకు, వ్యాపారాలకు డాలర్ వ్యవస్థకు వెలుపల లావాదేవీలు జరపడానికి మరో మార్గాన్ని అందించగలదు.
చైనాలో బంగారం డిమాండ్ పెరుగుదల కేవలం ప్రభుత్వ స్థాయిలో మాత్రమే లేదు. WGC ప్రకారం, చైనీస్ గోల్డ్ ETFలు సెప్టెంబర్‌లో 11 టన్నుల బంగారాన్ని చేర్చుకున్నాయి. ఇది వరుసగా మూడవ నెల నిల్వల పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం గోల్డ్ ETF నిల్వలు 304 టన్నుల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మూడవ త్రైమాసికంలో ఈ ETFలలో పెట్టుబడుల మొత్తం సుమారుగా $3.9 బిలియన్లు.
స్థానిక స్టాక్ మార్కెట్లో నెలకొన్న అస్థిరత, ప్రభుత్వ బాండ్లపై రాబడులు తగ్గడం వంటి కారణాల నేపథ్యంలో పెట్టుబడులను విస్తరించాల్సిన అవసరం ఏర్పడటమే దీనికి కారణమని చెబుతున్నారు. కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోళ్లను కొనసాగిస్తోందన్న వార్తలు కూడా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. అయితే పరిస్థితి పూర్తిగా ఆశాజనకంగా లేదు. బంగారు ఆభరణాలకు గిరాకీ బలహీనంగా ఉండటం కారణంగా, మూడవ త్రైమాసికంలో చైనా టోకు బంగారు గిరాకీ 234 టన్నులుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 21%, పదేళ్ల సగటు కంటే 44% తక్కువ.
ఇవన్నీ ఉన్నప్పటికీ, డాలర్ ఆధిపత్యం తక్షణమే ముగిసే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఒక కీలకమైన అంశంగా కొనసాగుతోంది. అయితే, విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరిచే ఈ ధోరణి కొనసాగితే, దీర్ఘకాలంలో డాలర్ ఆధారిత ఆస్తులకు విదేశీ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం, చైనా నిరంతరం బంగారం కొనుగోలు చేసే వ్యూహం, భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే దానిపైనా, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో బంగారం పెద్ద పాత్ర పోషించగలదా అనే దానిపైనా చర్చను మరింత తీవ్రతరం చేసింది.
ఇది కూడా చదవండి: House Slab: ఇంటి స్లాబ్ పోసే రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? చాలా మందికి తెలియని విషయాలివే..!.
ఇది కూడా చదవండి: PNG Hydrogen Blending: గ్యాస్ బిల్లు పెరగనుందా? పీఎన్‌జీలో హైడ్రోజన్.. కేంద్రం కొత్త ప్రతిపాదన ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి