Aadhaar Card: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ పనికిరాదా..? యూఐడీఏఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ఆధార్ అనేది దేశంలో నివసించే ప్రతీఒక్కరికీ అవసరమైన గుర్తింపు కార్డ్. ఇది లేనిది ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేము. అందుకే ఎప్పుడూ మన వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ పనికిరాదు.

Aadhaar Card: డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ పనికిరాదా..? యూఐడీఏఐ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
Aadhaar

Updated on: May 23, 2026 | 12:43 PM

దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డ్‌ను పరిగణిస్తున్నారు. ప్రభుత్వ సేవల నుంచి ప్రైవేట్ అవసరాల వరకు ప్రతీదానికి దీని అవసరం పడుతుంది. పేరు, అడ్రస్, వయస్సు.. ఇలా ప్రతీ సమాచారం ధృవీకరణ కోసం దీనిని అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ ఫ్రూఫ్‌ కోసం కూడా ఆధార్‌ను కొన్ని సంస్థలు ఉపయోగిస్తున్నాయి. అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ వినియోగించవచ్చా..? డేట్ ఆఫ్ బర్త్‌ను ధృవీకరించేందుకు ఆధార్ పనికిరాదా..? యూఐడీఏఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆధార్ ఉపయోగపడదు..

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదని యూఐడీఏఐ పలుమార్లు స్పష్టం చేసింది. కొంతమందికి ఆధార్‌లో ఒకలా.. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లలో మరోలా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. దీంతో డేట్ ఆఫ్ బర్త్‌ నిర్ధారణ కోసం ఆధార్ ఒక రుజువుగా ఉపయోగపడదని యూఐడీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్‌ను ధృవీకరించే పత్రం కాదని యూఐడీఏఐ చెబుతోంది. ఈ మేరకు ఆధార్‌ పుట్టిన తేదీ ధృవీకరణకు ఉపయోగపడుతుందని ఆధార్ చట్టం 2016లో పేర్కొనలేదు. దీంతో ఆధార్‌ను పుట్టిన తేదీకి రుజువుగా ఉపయోగించలేరు. ఇందుకోసం జనన ధృవీకరణ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, పాస్ పోర్ట్, ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించాలి.

ఆధార్ ఎందుకోసం..?

ఆధార్ కోసం నమోదు చేసేటప్పుడు బయోమెట్రిక్ వివరాలు తీసుకుంటారు. ఫేస్, ఫింగర్ ప్రింట్, ఐరిస్ లాంటివి తీసుకుంటారు. దీంతో కేవలం వ్యక్తి గుర్తింపు, అడ్రస్, వ్యక్తి పేరు, లింగం, తండ్రి పేరు వంటి వివరాల ధృవీకరణ కోసం మాత్రమే ఆధార్ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేకపోతే ఆధార్ తీసుకునేప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌ను జనవరి 1గా డీఫాల్ట్‌గా నమోదు చేస్తారు. దీంతో ఆధార్‌ను పుట్టిన తేదీ రుజువుగా ఉపయోగించలేరు. ఆధార్‌తో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే దానిని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు వ్యక్తిపై ఉంటుంది. ఈ విషయంలో యూఐడీఏఐకి ఎలాంటి సంబంధం ఉండదు. అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఆధార్‌ను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఉపయోగిస్తున్నాయి. కానీ దీని వినియోగం ప్రదేశాన్ని బట్టి మారుతుంది. కొన్ని సంస్థలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పదో తరగతి సర్టిఫికేట్‌ను జనన ధృవీకరణ కోసం ఉపయోగిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us