Investment Tips: పెట్టుబడిదారులపై బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ రెండు విధానాల్లో పెట్టుబడిపై సందిగ్ధం

|

Jul 28, 2024 | 5:45 PM

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసుగా మూడోసారి అధికారం చేపట్టాక ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్‌లో బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గిస్తూ కీలక ప్రకటన చేయడంతో బంగారం ప్రియులంతా రేట్లు తగ్గాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్టుబడిదారులను ఈ నిర్ణయం సందిగ్దావస్థలోకి నెట్టింది. ముఖ్యంగా గత ఐదేళ్లలో బంగారం రాబడి పరంగా స్టాక్‌లను అధిగమించింది.

Investment Tips: పెట్టుబడిదారులపై బడ్జెట్ ఎఫెక్ట్.. ఆ రెండు విధానాల్లో పెట్టుబడిపై సందిగ్ధం
Investment Tips
Follow us on

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసుగా మూడోసారి అధికారం చేపట్టాక ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ బడ్జెట్‌లో బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతానికి తగ్గిస్తూ కీలక ప్రకటన చేయడంతో బంగారం ప్రియులంతా రేట్లు తగ్గాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్టుబడిదారులను ఈ నిర్ణయం సందిగ్దావస్థలోకి నెట్టింది. ముఖ్యంగా గత ఐదేళ్లలో బంగారం రాబడి పరంగా స్టాక్‌లను అధిగమించింది. నిఫ్టీ 50 బంగారం 16.21 శాతంతో పోలిస్తే 13.95 శాతం రాబడిని ఇచ్చింది. అయితే  స్టాక్‌లు 20 సంవత్సరాల వరకు పొడిగించిన కాలంలో అత్యుత్తమ రాబడిని చూపించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ప్రస్తుతం పెట్టుబడి పెట్టడానికి స్టాక్స్ బెటరా..? బంగారం బెటరా..? అనే అనుమానం ఊగిసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడి అనువైన ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసకుందాం.

పెట్టుబడి నిపుణులు 2024 చివరికి బంగారం, స్టాక్స్ రెండు ఒకేరకమైన రాబడినిస్తాయని అంచనా వేస్తున్నారు. నిఫ్టీ 25,600 నుంచి 26,000 మధ్య ఉండవచ్చని అంచనాలు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 10 గ్రాములకు రూ. 81,500 వరకు పెరగవచ్చని అంచనా వేస్తన్నారు. అయితే పెట్టుబడిదారులు సమతుల్య విధానాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారి వ్యక్తిగత రిస్క్ ప్రొఫైల్‌ల ప్రకారం నిధులను కేటాయించడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 

ముఖ్యంగా బంగారం తగ్గుదల, పెరుగుదల అనేవి యూఎస్ డాలర్ ఆధారంగా ఉంటుందని అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కొంత మంది నిపుణులు మాత్రం బంగారంపై ప్రస్తుతం పెట్టుబడి పెడితే స్వల్ప కాలంలో మంచి రాబడిని పొందవచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారం పెట్టుబడులను సాధారణ 10-15 శాతం నుంచి 30-35 శాతానికి పెంచాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం స్టాక్‌లు, బంగారం రెండూ రికార్డు గరిష్ట రాబడులను ఇస్తున్నాయి. అయితే ఒక్కో విధానం ఒక్కో ప్రత్యేకమైన పెట్టుబడి లక్ష్యాలను అందిస్తోంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తూ అధిక రాబడిని పొందాలనుకునే వారికి స్టాక్స్ అనువుగా ఉంటే ఆర్థిక అనిశ్చితి కాలంలో రాబడి కోరుకునే వారికి బంగారం అనువుగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి