Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం..

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. వచ్చే నెలలో నాలుగు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. దీంతో బ్యాంక్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. దీంతో ఖాతాదారులు ముందే గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సమ్మె ఎప్పుడెప్పుడంటే..

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్..  వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం..
Bank Holidays

Updated on: Sep 07, 2026 | 2:16 PM

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఈ నెలలో బ్యాంక్ ఉద్యోగులు నాలుగు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నారు. రెండు విడతలుగా ఈ సమ్మె జరగనుంది. తొలి విడతలో ఒక రోజు పాటు సమ్మె చేపట్టనుండగా.. రెండో విడతలో మూడు రోజుల పాటు సమ్మెకు దిగనున్నారు. దీంతో ఈ నెలలో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది. ఖాతాదారులు దీనిని ముందే గమనించి జాగ్రత్త పడాల్సిన అవసరముంది. లేకపోతే బ్యాంక్ కార్యకలాపాల్లో అంతరాయం ఎదురుకావొచ్చు. యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద దేశవ్యాప్తంగా ఏడు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు ఉమ్మడిగా సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి ఐదు రోజుల పని విధానంతో పాటు పరితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు, ఇతర పెండింగ్ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ నెలలో రెండు విడతల్లో ఈ సమ్మె జరగనుంది. సెప్టెంబర్ 11వ తేదీన ఒక రోజు పాటు సమ్మె ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు మరోసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో మొత్తం నాలుగు రోజుల పాటు సమ్మె జరగనుంది. అయితే ఈ నెలలో తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే వచ్చే నెలలో నిరవధిక సమ్మె చేపడతామని బ్యాంక్ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నాలుగు రోజుల సమ్మెతో బ్యాంక్ సేవలకు ఈ నెలలో తీవ్ర అంతరాయం కలగనుంది. ఖాతాదారులు సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. సెప్టెంబర్ 11న సమ్మె కాగా.. సెప్టెంబర్ 12,13వ తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సందర్బంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది.

సెప్టెంబర్ 26వ తేదీ నాలుగో శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు కాగా.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమ్మె జరగనుంది. దీంతో ఐదు రోజుల పాటు బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది. దీంతో ఈ నెలలో ఎక్కువ రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశముంది. అయితే బ్యాంకులు మూతపడ్డా కూడా మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. అలాగే యూపీఐ సేవలు కూడా యథావిధిగా ఉంటాయి. దీంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే చేసుకోవచ్చు. కేవలం బ్రాంచ్ సంబంధిత కార్యకలాపాలు మాత్రమే నిలిచిపోతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us