
Bank Holidays: వచ్చే వారం బ్యాంకింగ్ పనుల నిమిత్తం బ్రాంచ్‌లకు వెళ్లేవారు ఒకసారి క్యాలెండర్‌ను తనిఖీ చేసుకోవడం మంచిది. మార్చి 30 నుండి ఏప్రిల్ 5, 2026 మధ్య కాలంలో మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు, వార్షిక ముగింపు (Annual Closing) కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు సుమారు 6 రోజుల పాటు మూతపడనున్నాయి.
ఆర్‌బీఐ (RBI) సెలవుల జాబితా ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:
గమనిక: ఏప్రిల్ 4 శనివారం (మొదటి శనివారం) కావడంతో ఆ రోజు బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. సాధారణంగా బ్యాంకులు నెలలో 2వ, 4వ శనివారాల్లో మాత్రమే మూతపడతాయి.
ఇది కూడా చదవండి: Raymond: ఇది అందరికీ ఒక గుణపాఠమే.. అన్నీ ఇచ్చి చివరకు అద్దె ఇంట్లో నివాసం.. ఒక తప్పు రేమండ్ అధినేత జీవితాన్ని మార్చేసింది!
బ్యాంక్ బ్రాంచ్‌లు భౌతికంగా మూతపడినప్పటికీ, డిజిటల్ సేవలకు ఎటువంటి ఆటంకం ఉండదు. కింది సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. UPI లావాదేవీలు: (Google Pay, PhonePe, Paytm మొదలైనవి). అందుబాటులో ఉంటాయి. అలాగే నెట్ బ్యాంకింగ్ అండ్ మొబైల్ బ్యాంకింగ్, నగదు బదిలీ (IMPS, NEFT, RTGS) కోసం, నగదు ఉపసంహరణ కోసం ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
చెక్ బుక్ రిక్వెస్ట్ చేయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా లోన్ అప్లికేషన్లు వంటి నేరుగా బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన పనులేవైనా ఉంటే, ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. స్థానిక పండుగలను బట్టి సెలవులు రాష్ట్రానికీ రాష్ట్రానికీ మారవచ్చు. సందేహం ఉంటే మీ సమీప బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి