Car Insurance: కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే బోలెడన్ని లాభాలు

|

Jun 26, 2024 | 5:00 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కారు అనేది స్టేటస్ సింబల్‌లా మారడంతో చాలా మంది కారు కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు సమయంలో కొన్ని రకాల బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద సమయంలో మన జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.

Car Insurance: కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే బోలెడన్ని లాభాలు
Vehicle Insurance
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో కార్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కారు అనేది స్టేటస్ సింబల్‌లా మారడంతో చాలా మంది కారు కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కారు కొనుగోలు సమయంలో కొన్ని రకాల బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాద సమయంలో మన జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి చార్జీలు చెల్లించకుండా యాడ్-ఆన్ కవర్స్ తీసుకుంటే మంచి లాభమని పేర్కొంటున్నారు. అలాంటి యాడ్-ఆన్ కవరేజీనే జీరో డెప్రిసియేషన్. జీరో డిప్రిసియేషన్ కవర్‌ని నిల్ కవరేజీ అని కూడా అంటారు. ఇది పాలసీదారు వారి సమగ్ర వాహన బీమా పాలసీ కింద పూర్తి మొత్తాన్ని క్లెయిమ్ చేసే అర్హతనిచ్చే యాడ్-ఆన్ పాలసీ. ముఖ్యంగా దెబ్బతిన్న లేదా భర్తీ చేసిన వస్తువుల తరుగుదల విలువను చెల్లించడం నుంచి మినహాయింపు లభిస్తుంది. మోటారు భీమా విషయంలో తరుగుదల అనేది వాహన కొనుగోలు సమయంతో పాటు అది పనిచేయకపోవడం లేదా ఇతర సమస్యల వంటి వివిధ కారణాల వల్ల వాహనం విలువలో తగ్గుదలని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో జీరో డెప్రిసియేషన్ ఇన్సూరెన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

 సాధారణంగా అన్ని వాహనాలు వాడే కొద్దీ ఆ వాహన విలువ తగ్గుతుంది. అయితే రిపేర్ విషయానికి వచ్చేసరికి మిగిలిన వాహనాల మాదిరిగానే చెల్లింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో జీరో డిప్రిసియేషన్ కవర్ లేని బీమా పాలసీతో పాలసీదారుడు పార్ట్ రీప్లేస్‌మెంట్ చేస్తే పూర్తి మొత్తాన్ని పొందలేకపోవచ్చు. ఎందుకంటే బీమాదారులు తరుగుదల మొత్తాన్ని తీసివేసిన తర్వాత భర్తీ చేసిన భాగాలకు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన మొత్తానికి బీమాదారు చెల్లించాలి. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ ప్రాసెస్ సమయంలో బీమా చేసిన వ్యక్తి గరిష్ట రీయింబర్స్‌మెంట్‌ను పొందడానికి కారు బీమా కోసం జీరో డిప్రిసియేషన్‌ని ఎంచుకోవడం ఉత్తమమైన ఎంపిక.

ఇవి కూడా చదవండి

జీరో డిప్రిసియేషన్ కవరేజీ వల్ల ప్రయోజనాలు

  • యాడ్-ఆన్ కవరేజ్ లగ్జరీ కార్ యజమానులకు రిపేర్లు లేదా ఖరీదైన విడిభాగాల రీప్లేస్‌మెంట్ ఖర్చును తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
  • ముఖ్యంగా ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల కోసం ఈ బీమాను కలిగి ఉండటం వల్ల మరమ్మతుల సమయంలో అధిక ఖర్చుల నుంచి వినియోగదారులకు రక్షణ ఉంటుంది. 
  • కొత్త వాహనాల యజమానులు తప్పనిసరిగా జీరో తరుగుదల కవర్‌ను జోడించాలి. ఎందుకంటే ఇది ప్రమాదం తర్వాత కూడా వారి కారు విలువను నిర్వహించడానికి సహాయపడుతుంది.
  • తరచుగా వరదలు, తీవ్రమైన వర్షాలను అనుభవించే ప్రాంతాలలో కార్లు నీటి వల్ల  నష్టానికి గురవుతాయి. ఈ రకమైన వాతావరణంలో జీరో తరుగుదల కవరేజ్ సహాయకరంగా ఉంటుంది. 
  • సాధారణంగా ఎక్కువ ప్రమాదాలు కొత్త డ్రైవర్ల వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి వాహనాలకు జీరో డెప్రిసియేషన్ కవర్ కలిగి ఉంటే ప్రమాద అనంతర ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ పాలసీ మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మీ వాహనానికి ఏదైనా జరిగితే మీరు ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

పరిగణించాల్సిన విషయాలు

  • మీ వాహనం ఎంత పాతదంటే జీరో తరుగుదల కవరేజీ ఎక్కువ అవుతుంది. ఈ యాడ్-ఆన్ 3 సంవత్సరాల వయస్సు పరిమితిలోపు కార్లకు వర్తిస్తుంది. మూడు సంవత్సరాల కంటే పాత కారుకు అధిక ప్రీమియంలు చెల్లించడం మంచిది కాదు. 
  • జీరో తరుగుదల కవర్ కింద నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే క్లెయిమ్‌లు చేయవచ్చు. కస్టమర్‌లు తమ కార్లలో మైనర్ డెంట్‌ల కోసం క్లెయిమ్‌లను దాఖలు చేయడం కుదరదు.
  • ప్రతి భాగానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) తరుగుదల రేటును తనిఖీ చేయాలి. ఒకవేళ ఐఆర్‌డీఏఐ ప్రకారం నైలాన్, ప్లాస్టిక్ భాగాలు, బ్యాటరీలపై ప్రాథమిక బీమా పాలసీని ఉపయోగించి వినియోగదారు క్లెయిమ్ చేస్తే  50 శాతం తరుగుదల తీసేస్తారు. ఫైబర్గ్లాస్ భాగాల కోసం 30 శాతం తరుగుదల తీసేస్తారు.
  • జీరో డెప్రిసియేషన్ కవరేజీకు సంబంధించిన ప్రీమియం వాహనానికి సంబంధించిన ఇంధన రకం అంటే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లేదా ఎలక్ట్రిక్ ఆధారంగా మారుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..