ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? బీ కేర్‌ఫుల్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..

ఆధార్ కార్డుతో నగదు ఉపసంహరణ (AEPS) అనేది ఏటీఎం లేదా డిజిటల్ చెల్లింపులు లేని వారికి సులభమైన పద్ధతి. అయితే ఈ పద్దతిలో డబ్బులు విత్ డ్రా చేసుకునేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడం ద్వారా మీ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? బీ కేర్‌ఫుల్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..
Aeps

Updated on: Oct 01, 2026 | 9:57 PM

మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును ఆధార్ కార్డును ఉపయోగించి సురక్షితంగా,  సౌకర్యవంతంగా ఉపసంహరించుకోవచ్చు. దీనినే ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (AEPS)గా పిలుస్తారు. ఏటీఎం కార్డులు లేని వారికి, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ఉపయోగించని వారికి, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేనివారికి ఇది గొప్ప ప్రయోజనకరంగా ఉంటుది. గ్రామాల్లో ఎక్కువగా ఈ వ్యవస్థను ఉపయోగిస్తన్నారు.  దగ్గరలోని సీఎస్సీ సెంటర్‌, బీసీ పాయింట్‌ లేదా ఆధార్ కార్డుతో నగదు ఇచ్చే ఏజెంట్ల వద్ద ఈ సేవలను పొందవచ్చు. మీ సమీపంలో ఆధార్ ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను అందించే అధీకృత ఏజెంట్‌ను సంప్రదించండి. ఏజెంట్ తన సిస్టమ్‌లో ఆధార్ ఏటీఎం వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌ను ఓపెన్ చేస్తారు. మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉందో ఆ బ్యాంక్ పేరును ఏజెంట్‌కు తెలియజేయండి. ఏజెంట్ ఆ వివరాలను ఎంటర్ చేస్తారు. ఆధార్ నంబర్‌, మీ మొబైల్ నంబర్‌ను ఏజెంట్‌కు అందించండి. ఈ వివరాలను సిస్టమ్‌లో నమోదు చేస్తారు. అనంతరం ఎంత విత్ డ్రా చేయాలనుకుంటున్నారో చెబితే.. అమౌంట్‌ను సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారు.

ఏజెంట్ దగ్గర ఉండే బయోమెట్రిక్ మెషిన్‌లో మీ ఫింగర్ ప్రింట్ నమోదు చేయాలి. అనంతరం మీకు ఏజెంట్ నగదును అందిస్తారు. లావాదేవీ పూర్తయిన తర్వాత ట్రాన్సాక్షన్ విజయవంతమైందని నిర్ధారించే రసీదునుఏజెంట్ నుండి తప్పనిసరిగా తీసుకోవాలి. మీ ఖాతా నుండి ఎంత మొత్తం విత్ డ్రా అయిందో కూడా రసీదులో స్పష్టంగా ఉంటుంది. దీంతో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రతిసారీ నగదు ఉపసంహరించే ముందు తప్పనిసరిగా బ్యాలెన్స్ ఎంక్వైరీ చెక్ చేసుకోవాలి. ఇది మీ ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి, అనవసరమైన గందరగోళాన్ని, మోసాలను నివారించడానికి సహాయపడుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా ఏజెంట్ల ద్వారా తెలియకుండా డబ్బు విత్ డ్రా కాకుండా ఇది రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక వ్యక్తిగత వివరాలు ఏజెంట్‌కు మాత్రమే అందించాలి. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను నమ్మకమైన ఏజెంట్‌కు మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ వేలిముద్రను ఇతరులు దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏజెంట్ సూచనల మేరకు మాత్రమే వేలిముద్రను ఉపయోగించాలి. వేలిముద్రకు ముందు స్కానింగ్​ పరికరాన్ని తప్పనిసరిగా పరిశీలించాలి. ఆ పరికరంపై అదనపు కాగితం, ఫిల్మ్​, స్టిక్కర్​ లేదా ఇతర అనుమానాస్పద వస్తువు అతికించి ఉందేమో చూడాలి. ఇక ఏజెంట్ ఐడీ కార్డు పరిశీలించాలి. అతడు నిజమైన వ్యక్తినా కాదా అనేది దీని ద్వారా తెలుస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us