
ఆధార్ కార్డుదారులకు అలర్ట్. యూఐడీఏఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆధార్‌లో వివరాలు తప్పుగా లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పేరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీ ఇతర ధృవీకరణ పత్రాల్లో ఎలా ఉందో.. అలాగే ఉండేలా చూసుకోవాలి. ఒక్కో డాక్యుమెంట్‌లో ఒక్కోలా ఉండటం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. దీంతో అన్ని పత్రాల్లో ఒకేలా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌లో పేరు జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో మీరు పేరు అప్డేట్ చేసుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి. తప్పులు లేకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలి. ఇటీవల ఆధార్‌లో పేరు సవరణలకు సంబంధించి యూఐడీఏఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
సెప్టెంబర్ 18, 2026న పేరు సవరణలకు సంబంధించి యూఐడీఏఐ ఒక సర్క్యూలర్ జారీ చేసింది. పేరు అప్డేట్ చేసుకోవాలంటే ఏయే పత్రాలు అవసరమనేది పేర్కొంది. పేరు మార్పులకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్ ఫిక్స్ చేసింది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ కింద గతంలో ఉన్న పాత నిబంధనల స్థానంలో వీటిని తీసుకొచ్చింది. ఇందుకోసం అక్టోబర్ 28,2021లో తెచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను వెనక్కి తీసుకుంది. ఇక నుంచి ఈ కొత్త ప్రోసీజర్స్ అమలు చేయనుంది.
-ఆధార్‌లో పేర్లను పెద్ద అక్షరాలతో నమోదు చేయాలి. మారుపేరు, సైనిక హోదా, అవార్డు వంటివి పేరులో అనుమతించరు. ఇలాంటి ప్రత్యేక ఆక్షరాలను పేరులో చేర్చుకునేందుకు అనుమతి ఉండదు
-వివాహం లేదా విడాకుల తర్వాత మహిళ తన ఇంటిపేరు మార్చుకోవడానికి అఫిడవిట్‌తో పాటు పాన్, ఓటర్ ఐడీ లాంటి గుర్తింపు రుజువును సమర్పించాల్సి ఉంటుంది
-లింగ మార్పిడి తర్వాత పేరు మార్చుకోవడానికి అవసరమైన పత్రాలు సమర్పించాలి
– పేరు నుండి హోదా, ర్యాంక్, ఇంటిపేరు మొదలైనవాటిని తొలగించడానికి గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి
-పేరు మధ్యలో ఏవైనా పెద్ద అక్షరాలు లేదాచుక్కలు ఉంటే, దానిని సరిచేయడానికి ఎలాంటి పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు
-రిజిస్ట్రేషన్ లేదా ఇంతకమందు అప్డేట్ చేసుకున్నప్పుడు సరైన పత్రం అందించినప్పటికీ.. డేటా ఎంట్రీ లోపం కారణంగా ఆధార్‌లోని పేరు తప్పుగా పడితే సరిదిద్దటానికి కొన్ని పత్రాలను అందించవచ్చు. అనుబంధం Bలో పేర్కొన్న పత్రాలను అందించాల్సి ఉంటుంది. పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, అనుబంధం Cలో పేర్కొన్న పత్రాలను అందించాలని యూఐడీఏఐ పేర్కొంది. డేట్ ఆఫ్ బర్త్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి అందించవచ్చు.