
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిందే. మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఆధార్ ఓటీపీలు మీరు అందుకోలేరు. దీని వల్ల వెరిఫికేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. అయితే ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబసభ్యుల ఆధార్ కార్డులన్నీ లింక్ చేయవచ్చా..? ఇందుకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి? అనే విషయాలు చూద్దాం

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ఒక మొబైల్ నెంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ ఆధార్లను లింక్ చేయవచ్చు. కానీ ఇందుకు కొన్ని కండీషన్లు ఉన్నాయి. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులను మాత్రమే ఒకే నెంబర్‌కు లింక్ చేయవచ్చు. చిన్నపిల్లలు, మొబైల్ వాడకం తెలియని వృద్దుల ఆధార్ కార్డులను కుటుంబసభ్యులు తమ మొబైల్ నెంబర్‌కు లింక్ చేయవచ్చు. అయితే ఒక మొబైల్ నెంబర్‌కు కేవలం 6 ఆధార్ కార్డులను మాత్రమే లింక్ చేయడానికి అనుమతి ఉంది.

ఈ సౌకర్యం వల్ల ఒకే మొబైల్ నెంబర్‌కు కుటుంబసభ్యులు ఆధార్ ఓటీపీలు పొందవచ్చు. అయితే కుటుంబసభ్యులు కానివారు, స్నేహితులు, ఇతరుల మొబైల్ నెంబర్లకు లింక్ చేసేందుకు అనుమతి లేదు. ఇలా చేయడం నిబంధనలకు కూడా విరుద్దం. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశముంది. మీ ఆధార్‌కు ముప్పు తెచ్చి పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటివి యూఐడీఏఐ అనుమతించదు.

కుటుంబసభ్యులు ఒకే నెంబర్‌కు లింక్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఓటీపీల నిర్వహణ అనేది సులువుగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్ ఉండదు. వారికి ఎలా వాడాలో కూడా తెలియదు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లకు లింక్ చేయాలి. ఇక వృద్దులకు ఫోన్ వాడకం గురించి తెలియదు. అలాంటి వారికి ఆధార్ కార్డులను కూడా కుటుంబసభ్యుల మొబైల్ నెంబర్లకు లింక్ చేయడం మంచిది. సమీపంలోని ఆధార్ సెంటర్ లేదా ఆధార్ యాప్, యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మొబైల్ నెంబర్లను లింక్ చేయవచ్చు.

అయితే ఆధార్‌ను మొబైల్ నెంబర్‌కు లింక్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీని వల్ల మీరు ఆధార్ సేవలు వేగవంతంగా పొందవచ్చు. ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, ఈకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయడం వంటి సులభతరం అవుతాయి. అందుకే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకుని ఉండాలి.