Aadhaar Card: పెళ్లి తర్వాత మహిళలు ఆధార్‌లో ఇంటి పేరు మార్చుకోవడమెలా..? ఆన్‌లైన్ ద్వారా సింపుల్ ప్రాసెస్ ఇదే..

ఆధార్ కార్డులో పెళ్లి తర్వాత మహిళలు ఇంటి పేరును సులువుగా మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే మార్చుకునే వీలుంది. గతంలో ఆఫ్‌లైన్ ద్వారానే మార్చుకునే అవకాశం ఉండగా.. ఇప్పుడు ఆన్ లైన్ విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాసెస్ ఎలా అనేది చూద్దాం.

Aadhaar Card: పెళ్లి తర్వాత మహిళలు ఆధార్‌లో ఇంటి పేరు మార్చుకోవడమెలా..? ఆన్‌లైన్ ద్వారా సింపుల్ ప్రాసెస్ ఇదే..
Aadhar Card

Updated on: Oct 07, 2026 | 12:27 PM

యువతులు పెళ్లి అయిన తర్వాత భర్త ఇంటి పేరును పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొ సర్టిఫికేట్‌లో ఒక్కొలా పేరు ఉండటం వల్ల సమస్యలు తలెత్తే అవకాశముంది. యువతులు వివాహం తర్వాత ఆధార్ కార్డులో సులువుగా ఇంటి పేరు మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. ఇంటి పేరుతో పాటు అక్షర దోషాలు, తప్పులు, శైలి అన్నీ మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే ఇంటి పేరు సులభంగా ఇంటి వద్ద నుంచి అప్డే్ట్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌(SOP)ను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ అప్డేట్ నిబంధనల్లో భాగంగా వీటిని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆధార్‌లో పేరు ఎలా మార్చుకోవాలనేది చూద్దాం.

ఆఫ్‌లైన్‌లో మార్చుకోవడం ఎలా..?

-ముందుగా మీ సమీపంలోని ఆధార్ సేవా సెంటర్‌కు వెళ్లండి

-ఆధార్ అప్డేట్ అప్లికేషన్‌ ఫారంను అడగండి

-ఫారంలో అన్ని వివరాలు సరిగ్గా నింపి ఆపరేటర్‌కు సమర్పించండి

-అవసరమైన డాక్యుమెంట్లను కూడా అందించండి

-అవసరమైన బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయండి

-ఆధార్ అప్డేట్ ఫీజు చెల్లించండి

-అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్‌కు సంబంధించి అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను ఆపరేటర్ నుంచి తీసుకోండి

-ఆ నెంబర్ ఆధారంగా మీరు ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు

ఇంటి పేరు మార్చుకోవడానికి ఏయే పత్రాలు అవసరం..?

గుర్తింపు రుజువుకు సంబంధించి ఏదైనా పత్రం అవసరం. అలాగే అనుబంధం డీ కూడా అవసరం. పాస్ పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ జాబ్ కార్డు, గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఫొటో గుర్తింపు కార్డు, కిసాన్ ఫోటో పాస్ బుక్, పేరు మార్పు కోసం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, ఫొటోతో ఉన్న వివాహ ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్‌లలో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. ఇక అడ్రస్ ప్రూఫ్‌గా పీడీఎస్, డేట్ ఆఫ్ బర్త్, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్, పిల్లలు పుట్టినప్పుడు ఇచ్చే ప్రభుత్వ ఆస్పత్రి డిశ్చార్జ్ కార్డ్, పోస్టల్ శాఖ జారీ చేసిన పేరు, ఫొటోతో కూడిన అడ్రస్ ప్రూఫ్ లాంటివి సమర్పించవచ్చు. ఇక మీ ర్యాంకులు, హోదాలు మారినప్పుడు కూడా పేరును మార్చుకోవచ్చు. లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, బ్రిగేడియర్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, సబ్ మేజర్, సబ్, నావిగేటర్ సబ్, హవల్దార్, నాయిక, లాన్స్ నాయిక, జస్టిస్, ప్రొఫెసర్, రిటైర్డ్, డాక్టర్, లెర్న్డ్, లార్డ్, శ్రీ, శ్రీమతి, కుమారి, మిస్టర్ మొదలైనవి చేరుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో మార్చుకోవడం ఎలా..?

యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లోనే అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us