Aadhaar Card: మీ ఆధార్ ఇతరులు ఉపయోగించకుండా చేయాలా..? సింపుల్‌గా ఇలా చేస్తే మీరు సేఫ్..

ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. దీంతో దీనిని సురక్షితంగా ఉంచుకోవాలి. ఇందుకోసం యూఐడీఏఐ అనేక ఫీచర్లు తీసుకొచ్చింది. వీటి ద్వారా మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు. ఇటీవల ఆధార్ మోసాలు పెరుగుతున్న క్రమంలో వినియోగదారులు జాగ్రత్త పడాలి. ఇదెలా అనేది ఇందులో చూద్దాం.

Aadhaar Card: మీ ఆధార్ ఇతరులు ఉపయోగించకుండా చేయాలా..? సింపుల్‌గా ఇలా చేస్తే మీరు సేఫ్..
Aadhaar Card

Updated on: Oct 18, 2026 | 4:59 PM

ఆధార్ అనేది ప్రతీఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఇది లేనిది ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పొందలేము. మీ వివరాల వెరిఫికేషన్ కోసం ప్రతీచోట సర్వీసులు పొందేందుకు ముందుగా ఈ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అందరికీ దీని అవసరం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తెరవడం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలు పొందటం వరకు ప్రతీచోట ఆధార్ ఉపయోగపడుతుంది. దీంతో ఈ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని ఎప్పుడూ మన వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యంత ముఖ్యమైన ఈ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని భద్రంగా ఉంచుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే ఆధార్‌లో మీ వ్యక్తిగత వివరాలన్నీ ఉంటాయి. ఈ కారణంగా మీ వివరాలను ఉపయోగించి వేరేవారు దుర్వినియోగానికి పాల్పడవచ్చు. దీనికి చెక్ పెట్టాలంటే ఆధార్‌కార్డు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

బయోమెట్రిక్స్ లాక్ చేయడం ఎలా..?

మీ ఆధార్‌కు సంబంధించి బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం ద్వారా మీరు మోసాల బారిన పడకుండా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఆధార్‌తో ఇతరులు ఎలాంటి పనులు చేయలేరు. ఎందుకంటే ఆధార్ ఎక్కడైనా ఉపయోగించాలంటే మీ బయోమెట్రిక్ ధృవీకరణ అవసరమవుతుంది. అదే మీరు లాక్ చేయడం వల్ల ఇతరులు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు. అవసరం లేనప్పుడు మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ చేసుకోవడం. అలాగే అవసరం ఉన్నప్పుడు వెంటనే అన్‌లాక్ చేసుకోవచ్చు. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం అవ్వకుండా రక్షణ ఉంటుంది. యూఐడీఏఐ పోర్టల్ లేదా ఆధార్ యాప్ ద్వారా మీరు క్షణాల్లోనే లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవడం ఎలా..?

–యూఐడీఏఐ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

-హోం పేజీలో మై ఆధార్ ఆప్షన్ కేటగిరీ ఎంచుకోండి

-ఆ తర్వాత ఆధార్ లాక్ లేదా అన్‌లాక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-యూఐడీ లాక్ ఆప్షన్ ఎంచుకుని మీ ఆధార్ నెంబర్, పేరు, పిన్ కోడ్ ఎంటర్ చేయండి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి

*-అనంతరం మీ ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ అవుతాయి

ఆధార్ అన్‌లాక్ చేయడం ఎలా..?

-యూఐడీఏఐ పోర్టల్ తెరవండి

-మై ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి

-ఆ తర్వాత అన్ లాక్ ఆధార్ బటన్‌పై క్లిక్ చేయండి

-ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చయండి

-అనంతరం మీ ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అన్‌లాక్ అవుతాయి

Loading...
Unable to load recommendations.
Follow Us