
MG Motors: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో కొత్త SUV అడుగుపెట్టింది. JSW MG Motor India తన కొత్త MG Hector Tomahawk PHEVను ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో విడుదల చేసింది. ఈ SUV ప్రత్యేకత ఏంటంటే.. పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీ, ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో 1,100 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
MG Hector Tomahawk PHEVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 20.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ SUVను ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా నడపవచ్చు. కంపెనీ ప్రకారం ఎలక్ట్రిక్ మోడ్‌లో మాత్రమే 115 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు.
ఈ SUVలో ప్రధాన ఆకర్షణ దాని రేంజ్. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసి, పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నింపితే 1,100 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని ఎంజీ చెబుతోంది. అలాగే కంపెనీ క్లెయిమ్ ప్రకారం కంబైన్డ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ 40 kmpl కంటే ఎక్కువగా ఉంటుంది. వాస్తవ రేంజ్ మాత్రం డ్రైవింగ్ స్టైల్, రోడ్డు పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
దీనిని 7-సీటర్ SUVగా తీసుకొచ్చారు. కుటుంబ ప్రయాణాలకు అనుగుణంగా విశాలమైన క్యాబిన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 15.6 అంగుళాల డిస్‌ప్లే, కనెక్టెడ్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.
సాధారణ కొనుగోలు ధర రూ.25.69 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ-ఏ-సర్వీస్ (BaaS) మోడల్‌లో ప్రారంభ ధర రూ.21.79 లక్షలుగా ఉంది. అయితే BaaS మోడల్‌లో బ్యాటరీ వినియోగానికి కిలోమీటర్ ఆధారంగా అదనపు ఛార్జీ ఉంటుంది. బ్యాటరీకి కిలోమీటరుకు రూ. 3.2 ఖర్చవుతుంది. మీరు కారును పర్మనెంట్ బ్యాటరీతో కొనుగోలు చేయాలనుకుంటే, దాని ధర రూ. 25.69 లక్షలు (ఎక్స్-షోరూమ్).
JSW MG ఇదే కారు పూర్తి ఎలక్ట్రిక్ (BEV) వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ఈ మోడల్ ప్రారంభ ధర కేవలం రూ. 13.99 లక్షలు. దీనిలో 69.2 kWh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇది ఒకే ఛార్జ్‌పై 517 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
కంపెనీ ప్రకారం MG Hector Tomahawk PHEV డెలివరీలు నవంబర్ 2026లో ప్రారంభం కానున్నాయి. ఈ SUVతో పాటు పూర్తిగా ఎలక్ట్రిక్ Hector Tomahawk EV వెర్షన్‌ను కూడా కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: New Rules: సెప్టెంబర్ 1 నుండి మారనున్న నిబంధనలు.. ఎల్‌పిజి సిలిండర్ ధరలతో పాటు ఆధార్‌లో కీలక మార్పులు!
ఇది కూడా చదవండి: Train Food Taste: రైలులో ఇచ్చే ఆహారం ఇంటి భోజనంలా ఎందుకు రుచిగా ఉండదు.. అసలు కారణం ఇదే!
ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి