ఇది దళిత ప్రభుత్వం: వైసీపీ ఎంపీ నందిగం

|

Oct 30, 2020 | 3:08 PM

దళిత సోదరులు చంద్రబాబు కుట్రలను తెలుసుకోవాలని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ కోరారు. “ఇది దళితుల ప్రభుత్వం… దళిత జాతిని అడ్డుపెట్టుకుని ఎదో చేయాలని ప్రయత్నం చేయొద్దు.. రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అన్యాయం అనిపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం. కోట్లాది రూపాయల లబ్ది మీ బంధువులకు ఇచ్చి ఇప్పుడు ఉద్యమం అంటే దళితులని వాడుకుంటున్నారు. లబ్ధి వాళ్ళకి.. పోరాటం మనకా..? మీఇద్దరిని ప్రజలు ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు. ముందు ఆ విషయం తెలుసుకుని […]

ఇది దళిత ప్రభుత్వం: వైసీపీ ఎంపీ నందిగం
Follow us on

దళిత సోదరులు చంద్రబాబు కుట్రలను తెలుసుకోవాలని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌ కోరారు. “ఇది దళితుల ప్రభుత్వం… దళిత జాతిని అడ్డుపెట్టుకుని ఎదో చేయాలని ప్రయత్నం చేయొద్దు.. రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అన్యాయం అనిపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం. కోట్లాది రూపాయల లబ్ది మీ బంధువులకు ఇచ్చి ఇప్పుడు ఉద్యమం అంటే దళితులని వాడుకుంటున్నారు. లబ్ధి వాళ్ళకి.. పోరాటం మనకా..? మీఇద్దరిని ప్రజలు ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు. ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది. రియల్ ఎస్టేట్ తప్ప అమరావతిలో ఏమన్నా జరిగిందా.? అక్రమం జరిగింది అంటే నిరూపించు అన్నావు.. విచారణ వేస్తే మళ్లీ కోర్టులకు వెళ్ళావు. దళితులు బాగుపడకూడదు అనే నైజం చంద్రబాబుది. మూడు రాజధానుల ఆందోళనకారులను అడ్డుకోవడానికి నీ సామాజిక వర్గం వ్యక్తులను ఎందుకు పంపలేదు.?”. అంటూ నందిగం అమరావతిలోని వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లపై ప్రశ్నలతో విరుచుకుపడ్డారు.