ఇది చివరిది కాదు.. సిద్ధంగా ఉండటం మంచిది: డబ్ల్యూహెచ్‌ఓ

| Edited By:

Sep 08, 2020 | 11:03 AM

ఇది ప్రారంభం మాత్రమేనని, ఇకపై ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో ఎదుర్కోవాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెడ్రోస్‌ అథనామ్‌ అన్నారు

ఇది చివరిది కాదు.. సిద్ధంగా ఉండటం మంచిది: డబ్ల్యూహెచ్‌ఓ
Follow us on

WHO on Coronavirus:  ఇది ప్రారంభం మాత్రమేనని, ఇకపై ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎన్నో ఎదుర్కోవాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెడ్రోస్‌ అథనామ్‌ అన్నారు. సోమవారం జెనీవాలో మాట్లాడిన ఆయన.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులకు ముందే సిద్ధమై ఉండటం మంచిదని ఆయన వెల్లడించారు. ”ఇది చివరి మహమ్మారి కాదు. ఇలాంటి విపత్కర పరిస్థితులు మన జీవితంలో భాగమని చరిత్ర మనకు పాఠాలను నేర్పింది. ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్దంగా ఉండాలి” అని హెడ్రోస్ వెల్లడించారు.

అయితే గతేడాది డిసెంబర్‌లో చైనాలో కరోనా వైరస్ విజృంభణ మొదలు కాగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 27,489,371మిలియన్లకు పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. అందులో 8,96,867 మంది చనిపోగా.. 19,590,501 మంది కోలుకున్నారు.

Read More:

డ్రగ్స్‌ కేసు.. నటి సంజన గల్రాని ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

వైరల్‌ వీడియో.. ఈ డ్రైవర్‌ డ్రైవింగ్ స్కిల్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే