డిప్రెషన్‌కూ ‘ఇన్సూరెన్స్’.. సుప్రీం నోటీసులు

| Edited By:

Jun 16, 2020 | 4:21 PM

మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రానికి, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ స్వీకరించిన సుప్రీం డిప్రెషన్‌కి ఇన్సూరెన్స్ కవరేజ్‌ను...

డిప్రెషన్‌కూ ఇన్సూరెన్స్.. సుప్రీం నోటీసులు
Follow us on

మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేంద్రానికి, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ స్వీకరించిన సుప్రీం డిప్రెషన్‌కి ఇన్సూరెన్స్ కవరేజ్‌ను ఎందుకు వర్తింపజేయరాదో సమాధానం ఇవ్వాలని కోరింది. ఇక దీనికి సంబంధించిన విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ నేపథ్యంలో కుంగుబాటు, యాంగ్జైటీలపై చర్చ నడుస్తున్న క్రమంలో.. సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం. కాగా బీమా పాలసీల్లో మానసిక అనారోగ్యాలకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని 2018లో ఐఆర్‌డీఏ బీమా కంపెనీలకు సూచించింది. శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్స తరహాలోనే డిప్రెషన్‌కీ బీమా కవరేజ్ కల్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశిస్తూ 2018 మేలో ఉత్తర్వులు జారీ చేసింది.

Read More: 

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

భగ్గుమంటోన్న పెట్రోల్ ధరలు.. పదో రోజు ఎంత పెరిగిందంటే?

ఖాతాదారులకు ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ ఆఫర్.. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం..