తెలంగాణకు 140 – ఏపీకి 84.. కృష్ణా జలాల పంపకం

|

Jan 09, 2020 | 4:39 PM

కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపకం చేసింది రివర్ బోర్డు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాలను పంపిణీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2020 మే 31 దాకా నదీ జలాలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవచ్చనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. సమావేశం వివరాలను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు పరమేశం మీడియాకు వెల్లడించారు. తాజా నిర్ణయం మేరకు […]

తెలంగాణకు 140 - ఏపీకి 84.. కృష్ణా జలాల పంపకం
Follow us on

కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపకం చేసింది రివర్ బోర్డు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాలను పంపిణీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2020 మే 31 దాకా నదీ జలాలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవచ్చనే అంశంపై క్లారిటీ ఇచ్చారు.

సమావేశం వివరాలను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు పరమేశం మీడియాకు వెల్లడించారు. తాజా నిర్ణయం మేరకు తెలంగాణ 140 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 84 టీఎంసీలను వినియోగించుకోవచ్చని పరమేశం తెలిపారు. ఈ నీటి కేటాయింపులు మే 31వ తేదీ వరకేనని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మరోసారి నిర్ణయం తీసుకుంటామని పరమేశం వెల్లడించారు.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏపీ 511 టీఎంసీలను వినియోగించుకోగా.. తెలంగాణ కేవలం 158 టీఎంసీలను మాత్రమే వినియోగించుకుందని బోర్డు నిర్ధారణకు వచ్చిందని ఆయన వివరించారు. నిష్ఫత్తి ప్రకారం కాకుండా అవసరాల మేరకు కేటాయించాలన్న ఉద్దేశంతో కాస్త లిబరల్‌గా కేటాయింపులు చేశామని పరమేశం తెలిపారు.