వికారాబాద్ కిడ్నాప్ వ్యవహారం కొలిక్కి.. దీపిక సేఫ్.!

|

Sep 29, 2020 | 4:03 PM

వివాహిత దీపిక కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ లో ఆదివారం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అఖిల్‌తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు పోలీస్ అధికారికి దీపిక చెప్పినట్లు తెలుస్తోంది. దీపిక, అఖిల్‌ తో మాట్లాడిన సదరు ఇన్‌స్పెక్టర్ ఇద్దరినీ క్షేమంగా వికారాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, రెండు గంటల్లో వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు దీపికను పోలీసులు తీసుకురానున్నారు. కాగా, ఉదయం వికారాబాద్ సీఐ రాజశేఖర్ టీవీ 9 తో […]

వికారాబాద్ కిడ్నాప్ వ్యవహారం కొలిక్కి.. దీపిక సేఫ్.!
Follow us on

వివాహిత దీపిక కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ లో ఆదివారం కిడ్నాప్‌కు గురైన దీపిక కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అఖిల్‌తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు పోలీస్ అధికారికి దీపిక చెప్పినట్లు తెలుస్తోంది. దీపిక, అఖిల్‌ తో మాట్లాడిన సదరు ఇన్‌స్పెక్టర్ ఇద్దరినీ క్షేమంగా వికారాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి, రెండు గంటల్లో వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు దీపికను పోలీసులు తీసుకురానున్నారు. కాగా, ఉదయం వికారాబాద్ సీఐ రాజశేఖర్ టీవీ 9 తో మాట్లాడుతూ ఇష్టపూర్వకంగానే దీపిక.. అఖిల్ తో వెళ్లినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. కిడ్నాప్ కు ఉపయోగించింది అఖిల్ కారు కావడంతో ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ముంబై వైపు వెళ్లినట్టు అనుమనిస్తున్నామని ఆయన చెప్పారు.

ఇలా ఉండగా, వికారాబాద్ కు చెందిన ఖలీల్ అలియాస్ అఖిల్ – దీపిక ప్రేమించుకున్నారు. 2016లో ఆర్యసమాజ్ లో వివాహాం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న దీపిక – అఖిల్ కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. అయితే లవ్ మ్యారేజ్ పేరెంట్స్ కి ఇష్టం లేకపోవడంతో దీపికను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. వీరి విడాకులకుకి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం దీపిక–అఖిల్ కోర్టుకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం అక్కతో కలిసి దీపిక షాపింగ్ వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకోబోతే తనను తోసేశారని దీపిక సోదరి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.