ఐఏఎస్ అధికారులు.. అప్పుడేం చేశారు..?: వర్ల రామయ్య

| Edited By: Ravi Kiran

Apr 17, 2019 | 7:08 PM

రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య. “ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్‌వీ సుబ్రమణ్యంతో సహా ఐపీఎస్ అధికారుల్లో కొంతమంది నిందితులని” గతంలో వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై ఎల్‌వీ సుబ్రమణ్యం చంద్రబాబుపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ వివాదంపై స్పందించిన ఆయన ఐపీఎస్ అధికారుల తీరుపై ఫైరయ్యారు. సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రతిపక్ష నేత జగన్ […]

ఐఏఎస్ అధికారులు.. అప్పుడేం చేశారు..?: వర్ల రామయ్య
Follow us on

రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య. “ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్‌వీ సుబ్రమణ్యంతో సహా ఐపీఎస్ అధికారుల్లో కొంతమంది నిందితులని” గతంలో వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపై ఎల్‌వీ సుబ్రమణ్యం చంద్రబాబుపై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ వివాదంపై స్పందించిన ఆయన ఐపీఎస్ అధికారుల తీరుపై ఫైరయ్యారు. సీఎం చంద్రబాబుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్‌లను ప్రతిపక్ష నేత జగన్ దారుణంగా అవమానించినప్పుడు ఈ రిటైర్డ్ అధికారులు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.