అమెరికా ఎన్నికల్లో హోరా హోరీ

|

Nov 04, 2020 | 2:55 PM

అమెరికా ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్‌ నడుస్తోంది. స్వింగ్‌ స్టేట్స్‌ ఇప్పుడు కీలకంగా మారాయి. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ట్రంప్‌ 14 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. జో బిడన్‌ 12 స్టేట్స్‌లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో పోటాపోటీ ఫలితాలతో చివరి వరకూ ఉత్కంఠగా సాగే అవకాశం కన్పిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం ఎలక్ట్రోరల్‌ ఓట్లు 538. ఇందులో 270 గెలిచిన వారే విజేత. కీలకమైన ఫ్లోరిడా, జార్జియా, ఒహియో రాష్ట్రాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. […]

అమెరికా ఎన్నికల్లో హోరా హోరీ
Follow us on

అమెరికా ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్‌ నడుస్తోంది. స్వింగ్‌ స్టేట్స్‌ ఇప్పుడు కీలకంగా మారాయి. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం ట్రంప్‌ 14 రాష్ట్రాలను కైవసం చేసుకున్నారు. జో బిడన్‌ 12 స్టేట్స్‌లో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో పోటాపోటీ ఫలితాలతో చివరి వరకూ ఉత్కంఠగా సాగే అవకాశం కన్పిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొత్తం ఎలక్ట్రోరల్‌ ఓట్లు 538. ఇందులో 270 గెలిచిన వారే విజేత. కీలకమైన ఫ్లోరిడా, జార్జియా, ఒహియో రాష్ట్రాల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇవి ఇప్పుడు కీలకంగా మారాయి. ప్లోరిడాలో రిపబ్లికన్లకు మంచి పట్టు ఉంది. ఇక్కడ ట్రంప్‌ 29 ఎలక్ట్రోరల్‌ ఓట్లు గెలిచే అవకాశం ఉంది. తొలి సారి అమెరికాలో ముందస్తుగా 100 మిలియన్స్‌ మంది ఓటేయటం ఒక విశేషం.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం డోనాల్డ్‌ ట్రంప్‌ గెలచిన రాష్ట్రాలు ఇలా ఉన్నాయి:
అలస్కా,
అర్కాన్సాస్,
కెంటుకీ,
లూసియానా,
మిసిసిపీ,
నెబ్రాస్కా,
నార్త్ డకోటా,
ఓక్లహోమా,
సౌత్ డకోటా,
టేనస్సీ,
వెస్ట్ వర్జీనియా,
వ్యోమింగ్,
ఇండియానా
దక్షిణ కరోలినా

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం బైడెన్ గెలచిన రాష్ట్రాలు ఇలా ఉన్నాయి:
కొలరాడో,
కనెక్టికట్,
డెలావేర్,
ఇల్లినాయిస్,
మేరీల్యాండ్,
మసాచుసెట్స్,
న్యూజెర్సీ,
న్యూ మెక్సికో,
న్యూయార్క్,
రోడ్ ఐలాండ్,
వెర్మోంట్
వర్జీనియా