‘మా శ్వేతను అజయ్‌ చంపాడు.. పోలీసుల అలసత్వం ఉంది’.. టీవీ9 తో పేరెంట్స్

|

Oct 13, 2020 | 10:13 PM

మా శ్వేత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు..ముమ్మాటికీ తమ బిడ్డను అజయ్ చంపాడు అంటున్నారు శ్వేత పేరెంట్స్. శ్వేత మరణంలో పోలీసుల అలసత్వం కూడా కారణమని మృతురాలి తల్లిదండ్రులు టీవీ9కి మొరపెట్టుకున్నారు. “అజయ్, శ్వేత ఒకే కాలేజీలో చదువుకున్నారు.. అజయ్ మా కూతురుని ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ చేశాడు.. పెళ్లి చేసుకోవాలంటే 10 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇస్తామన్నప్పటికీ తమ కూతురిని వేధింపులకు గురిచేశాడు..పెళ్లి చేసుకుంటానని తనతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను […]

మా శ్వేతను అజయ్‌ చంపాడు.. పోలీసుల అలసత్వం ఉంది.. టీవీ9 తో పేరెంట్స్
Follow us on

మా శ్వేత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు..ముమ్మాటికీ తమ బిడ్డను అజయ్ చంపాడు అంటున్నారు శ్వేత పేరెంట్స్. శ్వేత మరణంలో పోలీసుల అలసత్వం కూడా కారణమని మృతురాలి తల్లిదండ్రులు టీవీ9కి మొరపెట్టుకున్నారు. “అజయ్, శ్వేత ఒకే కాలేజీలో చదువుకున్నారు.. అజయ్ మా కూతురుని ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్ చేశాడు.. పెళ్లి చేసుకోవాలంటే 10 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇస్తామన్నప్పటికీ తమ కూతురిని వేధింపులకు గురిచేశాడు..పెళ్లి చేసుకుంటానని తనతో ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేశాడు.. అజయ్ పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు”. అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. పైగా సైబర్ క్రైమ్ పోలీసులు అజయ్ కి సపోర్ట్ చేసి.. తమ కూతురు మెంటల్ గా డిప్రెషన్ లో ఉన్నట్టు క్రియేట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అజయ్ పై చర్యలు తీసుకోకుండా.. తనదే తప్పు ఉన్నట్టు క్రియేట్ చేశారని దీంతో శ్వేత మరింత ఆవేదన గురైందన్నారు. శ్వేత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.. చదువులో చాలా ఇంటెలిజెంట్, సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేస్తుంది. అని విలపించారు.

దీనిపై మేడిపల్లి సిఐ అంజిరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. “శ్వేతా అనే అమ్మాయి కాకతీయ నగర్ లో నివాసం ఉంటుంది.. సెప్టెంబర్ 18న అర్ధరాత్రి ఘట్కేసర్ లోని రైల్వే ట్రాక్ పై చనిపోయిందని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు..శ్వేత తండ్రి స్టేట్మెంట్ తీసుకొని ఆ కేసును మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.. మేము కేసు నమోదు చేసి అజయ్ అనే వ్యక్తిని నిన్న అరెస్టు చేశాం.. శ్వేత మృతిపై దర్యాప్తు చేస్తున్నాము.. శ్వేత తల్లిదండ్రుల ఆరోపణలపై విచారణ జరుపుతున్నాం”. అని సీఐ చెప్పుకొచ్చారు.