తూర్పుగోదావరి జిల్లాలో కూలిన షాపింగ్ కాంప్లెక్స్

|

Oct 12, 2020 | 9:11 PM

ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా వణికిపోతోంది. పేక మేడల్లో పాత భవనాలు కుప్పకూలుతుండటంతో జనం భయపడుతున్నారు. పెద్దాపురంలో ఓ బిల్టింగ్ భారీ వర్షానికి‌ కుప్పకూలింది.

తూర్పుగోదావరి జిల్లాలో కూలిన షాపింగ్ కాంప్లెక్స్
Follow us on

Shopping Complex Collapses : ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా వణికిపోతోంది. పేక మేడల్లో పాత భవనాలు కుప్పకూలుతుండటంతో జనం భయపడుతున్నారు. పెద్దాపురంలో ఓ బిల్టింగ్ భారీ వర్షానికి‌ కుప్పకూలింది. మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో ఉన్న 18 షాపులకుగాను.. 2 షాప్‌లు కూలిపోయాయి. సోమవారం పెద్దాపురంలో షాప్‌లు క్లోజ్ చేయడం ఆనవాయితీ. దీంతో అక్కడ జనసర్థం లేకపోవడం, షాప్‌లు ఖాళీగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.

1979 లో ఈ కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగింది. వీటి లైఫ్‌స్పాన్ అయిపోయిందని, నాలుగు సంవత్సరాల క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా దుకాణదారులు మాత్రం ఖాళీ చెయ్యలేదు. ఇప్పటికైనా మిగిలిన షాప్‌లు ఖాళీ చేయాలని యజమానులను ఆదేశించారు ఆర్డీఓ మల్లిబాబు . కూలిన షాప్‌ల నుంచి శిథిలాలను జేసీబీలతో తొలగిస్తున్నారు. అయితే ఇలాంటి పురాతన భవనాలపై స్పెషల్ డ్రైవ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఇలాంటి బిల్డింగ్లు చాాలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.