కోవాక్జిన్ ట్రయల్స్‌లో రెండో దశ పూర్తి

|

Sep 16, 2020 | 1:48 PM

యావత్ ప్రపంచం ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతమయ్యాయి. పలు దేశాలు, పలు లాబరేటరీలు నిర్వహిస్తున్న కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్‌లో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో ...

కోవాక్జిన్ ట్రయల్స్‌లో రెండో దశ పూర్తి
Follow us on

యావత్ ప్రపంచం ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ వేగవంతమయ్యాయి. పలు దేశాలు, పలు లాబరేటరీలు నిర్వహిస్తున్న కరోనా వైరస్ క్లినికల్ ట్రయల్స్‌లో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిమ్స్ ఆసుపత్రిలో భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ రెండో దశ పూర్తి కావచ్చింది. తాజాగా నిమ్స్ ఆసుపత్రిలో వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 50 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు.

రెండు దశలో కోవ్యాక్సిన్ వ్యాక్సిన్‌ను 50 మంది వాలంటీర్లకు ఇచ్చిన నిమ్స్ వైద్య బృందం వీరందరికీ 21 రోజుల తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు మొదటి దశలో ఉన్న 40 మంది వాలంటీర్లకు, రెండో దశలో 50 మంది వాలంటీర్లకు కోవాగ్జిన్ వాక్సిన్ ఇంజెక్ట్ చేసినట్లు నిమ్స్ ఆస్పత్రి వెల్లడించింది.

భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాక్జిన్ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వ్యాక్సిన్‌పై నిమ్స్ వైద్య బృందం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. తాజాగా రెండోదశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన నేపథ్యంలో వ్యాక్సిన్ రూపకల్పనలో ఒక ముందడుగుగా భావిస్తున్నామని నిమ్స్ వైద్య బృందం వెల్లడించింది. ఈ మేరకు నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి క్లినికల్ ట్రయల్స్ వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.