Shocking news మే 29న వాతావరణంలో అనూహ్య మార్పు

|

May 26, 2020 | 7:53 PM

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ ఎండలు రికార్డవుతున్నాయి. అయితే.. మే 29న వాతావరణంలో అనూహ్య మార్పు వస్తుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Shocking news మే 29న వాతావరణంలో అనూహ్య మార్పు
Follow us on

Record level temperatures in India: కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఈసారి ఎండ ప్రభావం పెద్దగా తెలియలేదు గానీ.. గత నాలుగైదు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోడ్డెక్కేందుకు జనం గజగజ వణికిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల సెల్సియస్ ఎండలు రికార్డవుతున్నాయి. అయితే.. మే 29న వాతావరణంలో అనూహ్య మార్పు వస్తుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే, ఈ అనూహ్య మార్పేంటో మాత్రం క్లియర్‌గా చెప్పకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మంగళవారం రాజస్థాన్‌లోని చురు సమీపంలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఎండ వేడిమి రికార్డు కాగా.. దేశ రాజధానిలోని పాలెం (విమానాశ్రయ సమీప ప్రాంతం)లో 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఇది దేశంలో రెండో గరిష్ట ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.

పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ హర్యానా, ఢిల్లీ, దక్షిణ యూపీ, విదర్భ ప్రాంతాలకు తీవ్రమైన వేడిగాలుల హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మే 28 వరకు ఈ ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, మే 29న వాతావరణంలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంటుందని వారు తెలిపారు. ఈ అనూహ్య మార్పు ఏంటో మాత్రం వారిప్పుడే వెల్లడించడం లేదు. అయితే, ఈ అనూహ్య మార్పుతో భారీ ఉపశమనం లభిస్తుందని వారు చూచాయగా తెలిపారు.