Breaking News యాంటీ బాడీస్ తగ్గితే మళ్ళీ కరోనా

|

Oct 20, 2020 | 5:20 PM

ఒకసారి కరోనా వచ్చి... తగ్గిపోతే.. తిరిగి రెండోసారి కరోనా సోకుతుందా ? లేదా ? ఈ ప్రశ్నపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా సోకి.. కోలుకున్న తర్వాత ఇక భయం లేదని భావించే వారికి ఇది ఉపయోగపడే వార్త.

Breaking News యాంటీ బాడీస్ తగ్గితే మళ్ళీ కరోనా
Follow us on

Re-infection possible if Anti-bodies dies:  ఒకసారి కరోనా వచ్చి… తగ్గిపోతే.. తిరిగి రెండోసారి కరోనా సోకుతుందా ? లేదా ? ఈ ప్రశ్నపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా సోకి.. కోలుకున్న తర్వాత ఇక భయం లేదని భావించే వారికి ఇది ఉపయోగపడే వార్త. అదే సమయంలో కరోనా రెండోసారి వస్తుందని వణికిపోతున్న వారికి కూడా కాస్త ఉపశమనం కలిగించే వార్త. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ.

కరోనా సోకిన వ్యక్తుల్లో చాలా మంది ఇళ్ళకే పరిమితమైన కొన్ని మందులు.. మరికొన్ని జాగ్రత్తలు పాటించి గట్టెక్కుతున్న పరిస్థితి. కానీ మరికొందరు మాత్రం ఆస్పత్రుల పాలై లక్షలాది రూపాయలు వెచ్చించి కరోనా నుంచి బయటపడుతున్నారు. ఇలాంటి వారికి ఇచ్చే చికిత్సతో వారిలో యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయి. ఆ యాంటీ బాడీస్ కారణంగానే కరోనా సోకిన వ్యక్తుల కోలుకుంటున్నారు. ఆ యాంటీ బాడీస్‌నే తాము కోలుకున్న తర్వాత ప్లాస్మా రూపంలో ఇతర రోగులకు మరీ ముఖ్యంగా క్రిటికల్‌గా వున్న కరోనా బాధితులకు దానిమిస్తున్నారు.

అయితే, కరోనా వచ్చి ట్రీట్‌మెంటుతో కోలుకున్న వ్యక్తిలో అయిదు నెలల పాటు యాంటీబాడీస్ వుంటాయని, ఆ అయిదు నెలల్లో కరోనా తిరిగి వచ్చే అవకాశాలు లేవని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ వెల్లడించారు. అయిదు నెలల తర్వాత గనక యాంటీబాడీస్ పూర్తిగా తగ్గిపోతే.. అప్పుడు కరోనా వైరస్ తిరిగి సోకే ప్రమాదం వుందని ఆయన చెబుతున్నారు.

అందుకే కరోనా నుంచి బయట పడిన వ్యక్తులు తప్పకుండా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోందని బలరాం భార్గవ తెలిపారు. కరోనా ఇక రాదన్న మొండి ధైర్యం వద్దని, అలాగే తిరిగి కరోనా వస్తుందన్న ఆందోళన కూడా వద్దని ఆయన అంటున్నారు. సో.. మరో నాలుగు నెలల కాలం పాటు కరోనాతో సహజీవనం తప్పదన్న ప్రభుత్వాల ప్రకటనల మేరకు ప్రతీ ఒక్కరు వ్యక్తిగత భద్రత కోసం.. సామాజిక బాధ్యతగా మాస్కు ధరించాల్సి వుంటుంది. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.

Also read: ఏపీ స్కూళ్ళలో కోవిడ్ ఆంక్షలివే.. స్వయంగా చెప్పిన సీఎం

Also read: వరద సాయంపై జగన్ కీలక ఆదేశాలు

Also read: వరద బాధితులకు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం