యెస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ జరిమానా

|

Mar 05, 2019 | 4:38 PM

డిల్లీ: ప్రైవేటు రంగ యెస్‌ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) రూ. కోటి జరిమానా విధించింది. స్విఫ్ట్‌ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ నిబంధనలు పాటించనందుకు గానూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జరిమానా విషయాన్ని యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఆర్థిక సంస్థలు లావాదేవీల కోసం అంతర్జాతీయ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ‘స్విఫ్ట్‌’ను వినియోగిస్తాయి. ఈ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయడం వల్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.14,000 కోట్ల మోసం చోటుచేసుకుంది. పీఎన్‌బీ కుంభకోణం తర్వాత.. ఆర్‌బీఐ […]

యెస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ జరిమానా
Follow us on

డిల్లీ: ప్రైవేటు రంగ యెస్‌ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) రూ. కోటి జరిమానా విధించింది. స్విఫ్ట్‌ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ నిబంధనలు పాటించనందుకు గానూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా జరిమానా విషయాన్ని యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ఆర్థిక సంస్థలు లావాదేవీల కోసం అంతర్జాతీయ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ‘స్విఫ్ట్‌’ను వినియోగిస్తాయి. ఈ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేయడం వల్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో రూ.14,000 కోట్ల మోసం చోటుచేసుకుంది. పీఎన్‌బీ కుంభకోణం తర్వాత.. ఆర్‌బీఐ స్విఫ్ట్‌ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నిబంధనలు పాటించనందుకు గానూ ఎస్‌బీఐ సహా 8 బ్యాంకులపై ఇప్పటికే జరిమానాలను ఆర్‌బీఐ విధించింది.

గత శనివారం యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాపై రూ. 3 కోట్లు, దేనా బ్యాంక్‌పై రూ. 2కోట్లు, ఎస్‌బీఐ, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ. కోటి చొప్పున జరిమానా విధించింది. సోమవారం కర్ణాటక బ్యాంక్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ). కరూర్‌ వైశ్యా బ్యాంక్‌లపై రూ.11 కోట్ల జరిమానా విధించింది.